ఆమెను చేరి నా ప్రేమారాధనలు కన్నీళ్లై ఆమె పాదాలను కడిగి ,
నా వూపిరితో తుడిచి, అటుపైన నా తనివి తీరని తలపులను తెలపాలని గుండె నిండి పొర్లుతున్న తపనవున్నా........నాప్రయత్నలోపం వల్ల ఏవీ కుదరక……
* నాకు ఒక్క నిమిషం విశాంత్రినివ్వక మహాప్రణయ మారుత వేగం మీదన ,
అగాధ వియోగ భారం క్రిందన ... చీల్చి , నలిపి, ఊపిరాడనివ్వక నా జీవితాన్ని పాలించే మహానటి సావిత్రికి ఈ వెబ్ సైట్ నివేదితము
* శ్రీ చలం యొక్క ‘స్ర్తీ’ నుంచి తీసుకోబడినది.
పేరు: నిశ్శంకరరావు సావిత్రి
పుట్టిన తేది : డిసెంబర్ 6 1935
పుట్టిన వూరు: చిర్రావూరు గ్రామము,
తాడేపల్లి మండలం,గుంటూరు జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్
మొదటి సినిమా: ‘సంసారం’ 1950
మొత్తం సినిమాలు: 248 పైనే
మరణం: డిసెంబర్ 26 రాత్రి 08:50 1981