ఇంకా మరెన్నో విశేషాలు….

సత్తెనపల్లితో మహానటి సావిత్రి విగ్రహం

సత్తెనపల్లి పట్టణంలో మహానటి సావిత్రి విగ్రహ ప్రతిష్ట గురించి శ్రీ కంఠంనేని వెంకటేశ్వరరావు,కోశాధికారి,ఘంటసాల కళానిలయం, సత్తెనపల్లి,ఫోన్-9247182223, ఇచ్చిన వివరాలు.

తెలుగింటి ఆడపడుచు ,సాంప్రదాయ సహజనటి,అభినేత్రి,నటశిరోమణి,కళామతల్లి కంఠాభరణం-ముద్దుబిడ్డ,మురిపించి మైమరపించిన మాణిక్యం, హావభావ ప్రకటనల సహజత్వంతో నటించిన ఏకైక వెండి వెన్నెల తెలుగు తార,మహానటి సావిత్రి.ఇంతవరకు గుర్తింపుగా ఎక్కడా విగ్రహ ప్రతిష్ట జరిపియుండలేదనియు,అట్టి కార్యక్రమమును చేపట్టిన ఘనత సత్తెనపల్లి పట్టణానికి దక్కాలనే సద్భావనతో ఈ మహానటి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమమును చేపట్టి ఆ మహనీయురాలి విగ్రహము జిల్లా పరిషద్ వారి ఆధ్వర్యములో వున్న యన్.టి.ఆర్.కళాక్షేత్ర ప్రాంగణంలో ప్రతిష్టించుటకు ది. 1-3-2008 న అనుమతి పొంది,ది. 19-5-2008 న విగ్రహ దాతలు అయినటువంటి శ్రీ గుబ్బా చంద్రశేఖర్ గారిచే (ఎ.పి.పి.సి మెంబర్,ఆర్య వైశ్య రాజకీయ కమిటి రాష్ట్ర చైర్మన్) ఆవిష్కరింపబడినది.
మహానటి సావిత్రి గారి అందము గాని,రూపు గాని విగ్రహంలో తీసుకురాలేకపోయారేమి? అని శిల్పిని ప్రశ్నించగా , “అంతటి సౌందర్యవతిని ఎలాగండీ ఈ రాతిలోకి తేవడం”, అని వారి అసహాయతను వెలిబుచ్చారు.

Back

Lingual Support by India Fascinates