శ్రీ మతి సావిత్రి ఆంధ్ర పత్రిక 1964

ఈనాడు తెలుగు చిత్ర పరిశ్రమను చూచి నేను ఎంతగానో గర్విస్తున్నాను. మన తెలుగు చలన చిత్ర పరశ్రమ – కళాకారులను – నిపుణులను – నిన్న మొన్నటి వరకు ఎవరూ సరిగా గుర్తించలేదనుకుంటాను. నేటికి చిత్ర పరిశ్రమలోని పెద్దల పుణ్యం వల్ల ఆంధ్ర కళామతల్లికి స్వేచ్ఛ లభించింది. తెలుగు కళాభిమానులందరం ఆ తల్లికి సేవచేసే అవకాశం కలిదినందుకూ, కలుగబోతున్నందుకు ఆనందిస్తున్నాను. “ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారికి నా కృతజ్ఞతాభివందనములు” ఈ సందర్భములో తెలుపుకుంటున్నాను.

ఆంధ్ర రాజధాని అయిన హైదరాబాదులో నేడు తెలుగు సినిమారంగం అభివృద్ధి చెందడానికి అచట ఉన్న వాతావరణము పూర్తిగా తోడ్పడగలదు. పరిశ్రమకు అందుబాటులో లేని పరికరములు సరఫరాకు ప్రభుత్వం తోడ్పడగలదని నా విశ్వాసం. నేడు హైదరాబాదుకు చేరుకోవాలనే ఆశ కళాకారులలోను, సాంకేతిక నిపుణులలోను వుంది. అది త్వరలో నెరవేరగలదు. మనము – ప్రభుత్వము కలసి కృషి చేసిన యెడల మన పరిశ్రమ తెలుగుభాషలోనే కాక, ఇటు తమిళము, అటు హిందీ భాషలలో కూడా మిన్న అనిపించుకోగలదు. ప్రతి పరిశ్రమలో కూడా అందులో వుండే ప్రతి ఒక్కరూ చేదోడువాదోడుగా కలసి పనిచేస్తే ఎంతయినా ముందుకు రాగలగుతుంది.

అలాగే ఈ సినిమా పరిశ్రమ కూడా.

నాకున్న ఆశ? అది అత్యాశయే కావచ్చు- అమెరికాలో హాలివుడ్ ఎలా వున్నదో, ఆ రీతిగా కొంతలో కొంతయినా మన తెలుగు పరిశ్రమ ప్రసిద్ధిగాంచగలదనే నా ఆశ నిరాశకాదని దృఢనమ్మకం. మేమంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు చలనచిత్ర పరిశ్రమకు చేస్తున్న సహాయానికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలుపుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది. నాకు తోచిన విషయములను మీకు తెలుపుకునే అవకాశం కల్పించినందుకు నా కృతజ్ఞత.

Back

Leave a Reply