చిత్ర సీమ సెప్టెంబర్ 1957 ,నుంచి….

సావిత్రికి మామూలు సమయాల్లో ‘మేకప్’ చేసుకోవమంటే మహామంట.సింపుల్ గా ఉంటేనే బాగుంటుందని ఆమె అభిప్రాయం. సావిత్రి అంటే నిర్మాతలకు చాలా సదభిప్రాయం ఉంది. సెట్స్ లోకి వెళ్లిందంటే , ఏ ‘మూడ్’ లోకి వెళ్లాలన్నా, డైరక్టర్ చెప్పిన మరుక్షణంలో ఆ ‘మూడ్’లో ప్రవేశించగలదు.అంతేగాని, యివ్వాళ ‘మూడ్’లో లేనండి అనే ఆర్టిస్ట్ కాదు సావిత్రి. ‘వేంప్ రోల్స్’ అన్నా , వేంప్ గా వుండటమన్నా ఆమెకు సుతారామూ యిష్టం లేదు.

సౌందర్యార్చన కోసం టాయిలెట్స్ ,క్రీములు వాడటం యిష్టం లేదంటుంది సావిత్రి . ‘మేకప్’ దేనితో చేసుకుంటారు మీరు ? అని చాలా మంది ప్రశ్నిస్తారు.దేనితోనూ చేసుకోను ,అంటుందామె.చిరునగవుకు మించిన సౌందర్య భూషణం మరేదీ లేదని ఆమె అభిప్రాయం.తన అభిమానులు వ్రాసే ఉత్తరాలన్నీ చదువుతుంది గాని,తీరిక చిక్కనందున అందరికి వ్రాయటం కుదరటం లేదని ఆమె చింతిస్తుంది.

Back

Leave a Reply