ఈనాడు ఆదివారం 7 అక్టోబరు 2007 నటి గీతాంజలి కబుర్లు

“బలరామశ్రీకృష్ణ” అని మరో హిందీ సినిమా అందులో సావిత్రిగారు బలరాముడి భార్య రేవతిగానూ నేను శ్రీకృష్ణడిభార్య రుక్మిణిగానూ నటించాం. ధారాసింగ్, సాహుమొడక్ లు బలరామాకృష్ణులుగా నటించిన ఆ సినిమా వందరోజులు ఆడింది.

ఆ సినిమా షుటింగ్ సమయంలోనే సావిత్రిగారూ నేనూ చాలారోజులు బొంబాయిలో ఉన్నాం .ఆవిడ ఎప్పుడూ సరదాగా ఉండేవారు. ఆమెకు మంచి భోజనం అంటే ఇష్టం. దాంతో అక్కడ వాళ్లు పెట్టే చపాతీలూ పప్పూ తినలేకపోయేవారు. ఛీ…ఛీ…ఈ గడ్డి ఇంకా ఎన్నొ రోజులు తినాలి…

హాయిగా కడుపునిండా తిని పనిచేసుకునేవాళ్లం చచ్చినా మరోసారి ఈ హిందీ సినిమాలు ఒప్పుకోకూడదు అనేవారు. చివరకు ఓ రోజు జెమినీగణేశన్ గారు రెండు క్యారియర్ లు పట్టుకుని నిమానం దిగారు , చేపలకూర , కోడికూర, బిర్యానీలు అన్నీ తీసుకుని. అందరం ఆవురావురుమంటూ తిన్నాం మానాన్నగార్ని శ్రీరామమూర్తి గారూ మొహమాటపడకుండా లాగించేయండి……. మళ్ళీ ఎప్పుడు తింటామో అనేవారు సావిత్రి.

Back

One Comment

Leave a Reply