“కినిమా” పత్రిక జూన్ 1958

సినీ తారలపై నిర్వచనాలు. ఫిలోమెన్ దాస్
( ఇవి కేవలం హాస్యం కోసం వ్రాయబడినవి. కాబట్టి నవ్వుతూ చదవండి)

జి. వరలక్ష్మ : పీడిత నాయకులకై ఎర్ర మేఘాలలో సంచరించిన ఆరుణతార.

సావిత్రి : తెరమీదే కాకుండా, తెర వెనక కూడ ఆదర్శ జీవితాన్ని నడుపుచున్న మేడం… సావిత్రి.

కృష్ణవేణి : స్థితి స్థాపక హద్దుదాటి తెగిపోయిన రబ్బర్ యొక్క

జానకి : హక్కడు బుక్కడు అనతగ్గ విజయా అధినేతలచే చెక్కబడిన చెక్క బొమ్మ.

కృష్ణకుమారి : అవకాశం చిక్కినా, కాలదోషం వల్ల కలసిరాని కమ్మని నటీమణి –

కుసుమకుమారి : తీక్షణమైన పవనాలకు ఆగలేక గోతాలు కోడ్తుయున్న తోక తెగిన గాలిపటం.

వహీదా : దక్షిణాదిలో విత్తనం నాటబడి. ఉత్తారాదిలో పెరుగుతున్న అనార్కాలి ( దానిమ్మ పువ్వు)

వైజయంతి మాల : మదరాసు టాలీవుడ్ నుంచి బొంబాయి హాలీవుడ్కు అంకితం చెయ్యబడిన తార.

నాగయ్య : కళామతల్లిని ఉద్దరించ కాసులుగానక కటకటలాడే కళాజీవి.

నారాయణరావు : కాల మార్పుచే విలువ తగ్గి మూల పడిన వెండి నాణెం.

రఘరామయ్య : దశాబ్ధి క్రితం పామర జనాన్ని తన ఈల గానంతో మైమరిపింపజేసిన నిండు మూర్తి

దొరస్వామి : అవకాశం చిక్కినప్పుడెల్ల తెరపై ఉరికంబమెక్కే నిరాశ జీవి.

గౌరీనాధ శాస్త్రీ : ఆంధ్ర హాలీవుడ్ నుంచి క్రిందరాలిపోయిన తోకచుక్క.

సి. యస్. ఆర్. : డొక్క శుద్ధి, చిత్తశుద్ధి కలిగిన పసందైన పక్కా నటుడు.

శివాజీ గణేశన్ : ఉద్రేకపూరితమైన ఊకదంపుడు ఉపన్యాసాలచే హాలు నంతటిని ఆరావం కావించే అపర గగ్గయ్య.

శివరావు : తన వేలుతోనే తన కంటిని పొడుచుకొని, కొంతకాలం చీకటి కూపంలో పడి, యిప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న అతి హాస్యనటుడు.

ఘంటసాల : తన ఘంటారావంతో దక్షిణాది నంతటినీ ఒక ఊపు ఊపిన దివ్వమూర్తి.

దక్షిణామూర్తి : కాపీ సంగీత దురంధర మూర్తి.

సుశీల : పండిత పామర హృదయాలను కరిగించే కోయిల.

హెచ్.ఎం.రెడ్డి. : ఇటు కళను ఉద్ధరించక, అటు బాక్సాఫీసు బ్రద్దలు కొట్టక విశ్వామిత్ర సృష్టి కావించబడిన పితామహుడు.

రూడ్ : ఆంధ్ర హాలీవుడ్ నుంచి ఆకాశానికి అన్నపూర్ణా వారిచే వదలబడిన ఆంధ్ర లైకా.

Back

Leave a Reply