1967లో ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో పాఠకుల ప్రశ్నలకు సావిత్రి సమాధానాలు.(323 ప్రశ్నలు) సుభాష్ చంద్రబోస్, అవనిగడ్డ.

ప్రః మీరు సమాధానాలు యిస్తున్నారనే సరికి లాటరీలో లక్ష రూపాయలు వచ్చినంతగా సంతోషం కలిగంది కారణం ఏమిటంటారు?

జః ఏముంటుందిః మీ ఆభిమానం అల్లాంటిది- Thanks.

ఎఃయాదేంద్ర గౌడ్ హైదరాబాద్.

ప్రః వెలుగుకి చీకటికి తేడా ఎంతండి?

జః ఈ రోజుల్లో వ్యాపారానికి. స్మగ్లింగ్‌కూ వున్నంత….

భంబోయిన వెంకట రామకృష్ణారావు, భీమవరం.

ప్రః విచారం అనేది కలగకుండా వుండాలంటే ఏం చేయాలి?

జః పకపక నవ్వుతూండండి.

బి.లింగారావు కవాడిగూడ.

ప్రః మేనరికం గదా అని యిష్టం లేకపోయినా పెద్దల ఒత్తిడి వలన పెళ్ళాడాడు అతడు ఓ అమ్మాయిని. ఆమెకు చదువు రాదు. అతను చెప్పడానికి ప్రయత్నిస్తే ఆమె నిరాకరించింది. ఎలా?

జః ఇష్టం లేకపోతే బలవంతాన్న చదివించినా ప్రయోజనమేముంది. కమ్మగా కాపురం చేసుకోమనండి… ఏ గొడవా వుండదు.

సి.మల్లయ్య ఎల్లందు.

ప్రః ఆడవాళ్ళు మగవారి మనసు ఇట్టే మార్చేయగలరు. మరి మగవారు అలా మార్చలేరు ఎందుకు? రోజూ ఓ యువతి ఎదరై నవ్వి, నవ్వించి, నన్ను రెచ్చగొడుతూ ఉంటుంది. నేను దగ్గరకు వెళ్ళబోతే పారిపోతూంటుంది ఎందుకు?

జః మీ మొదటి ప్రశ్న రెండో దానివలన ఆర్థమయింది, మరీ అంత వెనక పడకండి…

జి.వి.సి రంగారావు భోధన్.

ప్రః పరిస్థితులతో రాజీపడలేక. తప్పుకోలేక, పెరిగే ధరల మధ్య గొంతుదాక దిగబడిపోయి. ప్రభుత్వమూ గుర్తించక పై ఆధికారులు జీతాలు పెంచక, పెంచమని అడగలేక, పడే భాధలు అంతమయ్యేది ఒక ఆత్మహత్య తోనేనంటారా? మరేదైనా మార్గం వుందంటారా?

జః మధ్య తరగతికిది తప్పనిసరిః యుగసంధిలో చిక్కులు తప్పవు.

వి. వి. స్వామి, కరీంనగర్.

ప్రః కేవలం “ స్త్రీ” నే పతివ్రతగా జీవించమని ఆదేశిఁ చాడంటారా దేవుడు.

జః లేదేః శ్రీరామ చంద్రుడిలా వుండమని మగవాళ్లను ఆదేశించాడుగదా.

ప్రః సమయంతోడై అనుభవించే అవకాశం కలిగితే ఏం చేయాలి?

జః ఆలోచిస్తూ కూర్చుంటే అది కాస్తా చేజారి పోతుంది.

డి.సరోజ. నూజివీడు.

ప్రః నేను ఇంజనీరింగ్ కోర్సు చదవాలనుకుంటున్నాను. కాని ఇంట్లో అంగీకరించటం లేదు. ఎల్లా?

జః మీ ఆర్థిక పరిస్థితులు ఆలోచించడం, అర్ధం చేసుకోవడం ముఖ్యం నీకు,

వెళ్శూరి సుబ్బలక్ష్మి. బాగాయిలంక.

ప్రః ఒక అల్లుడికి అత్తగారిఁట్లో అందరూ తిన్నాక భోజనం పెడతారు…

జః ఇల్లరికపు అల్లుడేమే –పాపం.

డి. టి.మాధవశర్మ- విజయవాడ.

ప్రః మీ హాబి ఏమిటి?

జః ప్రస్తుతం — నలభీమపాకం.

ఆది – కుందేరు.

ప్రః భాగ్యవంతుల బిడ్డలు, ఎంత డబ్బు గల వారైనా, మరి అంత ఒంటి మీద బట్టలుండీ లేనట్లు డ్రెస్ చేసుకుంటారు… గుడ్డ కరువా? ఈ అర్ధనగ్నానికి కారణం?

జః మోడరన్ ఫాషన్ మరి….

పి.రామ్మోహన్ – కావలి.

ప్రః తెలుగు చిత్రాలలో సంఘటనలు సహజత్వానికి దూరంగాను, బెంగాలీ చిత్రాల్లో దగ్గరగాను వుంటుంటాయి, కారణం?

జః మన స్పీడ్ అల్లాంటిది.

ప్రః హాలీవుడ్ చిత్రరంగంలో మీ అభిమాన హాస్యనటులెవరు?

జః జెర్రీలూయిన్. రెడ్ వ్కలిటన్,

జి.జె, రావు. విజయవాడ.

ప్రః ఒకామె తన మేనమామను చేసుకోవాలను కుంది. కాని ఆయన మరొకరిని ప్రేమించి వున్నారు, చివరికి ఈ మేనమావను పెళ్లాడింది. వారికొక బిడ్డ కలిగంది. ఆ బిడ్డకు ఆయన తన ప్రియురాలి పేరు పెట్టుకున్నారు. భార్యకు తెలుసున్నా భాదపడలేదు. ఆయన మనస్సు ఆమె మీద నుంచి తప్పుకోవడం లేదు.రోజూ భాదపడతారు, ఆయన భాద చూడలేక భాధ పడుతుంటుంది. వారిద్దరి ప్రేమకు తను అడ్డుగా నిలబడ్డానేమోనని కుమిలిపోతూంటుంది… …. వారిద్దరిని విడదీశానా అని ఏడుస్తుంది ? ఏం చేయాలి ఆ భార్య?

జః ఉన్న బాధను మరింత రెచ్చగొట్టక. అమె తన సేవలతో తన భర్త మనసు మార్చుకోవాలి. ఆ బాధ నుంచే మరపించగలగాలి.

ప్రః 150 చిత్రల్లో నటించారుగదా? మీ మనస్సుకి నచ్చిన జోడీ (సినిమా) ఎవరు చెప్పండి?

జః నిజం చెప్పనా? శ్రీమతి సావిత్రి, నటి సావిత్రి కలసి కనిపించిన చిత్రం జోడి.

ఆర్. జగన్మోహనరావు.

జి.మృత్యంజయరావు. బొబ్బిలి.

ప్ర. సినీరంగంలో పేరూ ప్రఖ్యాతి గడించడం నటునకు సులభమా నటికా?

జః ఇద్దరకీ సులభంకాదు.

సి. సీలాకుమారి. వైజాగ్.

ప్ర. మీరే నెలలో పుట్టారు?

జః జనవరి ( 4 వ తేది) నెలలో.

కె. వెంకటెశ్వర్లు. వరంగల్.

ప్రః కష్టాల్లో వున్నప్పుడు, స్నేహితులు కూడా వదిలేస్తారేమండి?

జః అల్లా వదిలేసే వారిని స్నేహితులు అంటారేమిటి? అవసరానికి చేరే పరిచయస్థులందరూ ప్రాణమిత్రులుకారు- కాలేరు.

గత్తుల గంగాధరరావు, వేల్పూరు.

ప్రః మీరు, అక్కినేని నాగేశ్వరరావు కలసి నటించిన చిత్రాలు చూస్తే ఒక విధమైన నిజజీవిత సంఘర్షణ కనిపిస్తుంది. కారణం?

జః “యాక్టింగూ”, “ యాక్షనూ” కలియడం వలన…

పి. రమాదేవి నెల్లూరు.

ప్రః డబ్బున్నవారు డబ్బుందిగదా అని కట్నాలు పోసి ఆడపిల్లలకు పెళ్ళిళ్లు చేస్తున్నారు, ప్రభుత్వం దీన్ని అరిగట్టలేక పోతోంది. కట్నం యివ్వందే పెళ్ళి జరిగేలా లేదు. మీ దగ్గరకూడా చాలా డబ్బుందని మీ అమ్మాయికి కట్నం యిచ్చే పెళ్ళిచేస్తారా?

జః ఆడపిల్లల్ని కన్న తర్వాత సమయానుకూలంగా నడుచుకోవసిందే, ఎవరైనాసరే.

ప్రః మీరు నాగేశ్వరరావుగారు కలసి నటిస్తున్న చిత్రాలేమైనా వున్నాయా యిప్పుడు?

జః ప్రస్తుతం ఎమీ లేవు.

ప్రః మీ మొదటి చిత్రంలో మీ ప్రక్క నటించిన హీరో ఎవరు?

జః ఆ చిత్రంలో హీరోలేడు.

ప్రః భారత ప్రియతమరత్న శ్రీ నెహ్రూజీని మీరు అఖరిసారి ఎక్కడ కలుసుకున్నారు?

జః స్టేట్ ఎవార్ట్సు ఫంక్షనులో 1965 ఏప్రిల్ 25వ తేదిన డీల్లీలో వారిని కలుసుకుని మాట్లాడగలిగాను.

ప్రః సినిమా నటులను ముచ్చటపడి చూడవచ్చిన ప్రజలు తిరిగి ఆ నటులపైనే రాళ్ళు రువ్వటంలో ఆంతర్యం ఏమిటంటారు?

జః కేవలం కట్టలు తెగిన ఉత్సాహ ఫలితం అది.

యన్. మలారెడ్డి, నిజామాబాద్.

ప్రః నాగేశ్వరరావుగారి “నేనూ, నా జీవితం” పిదప “నేను, నా నటన” అనే శీర్షికతో మీరు “ ఆంధ్రజ్యోతి” లో వెలువరచకూడదా?

జః అవకాశం వుంటే అల్లాగే.

సుమతిబాయి. కోనాల.

ప్రః సుఖసంతోషముల విలువ తెలియాలి అంటె ముందు బాధననుభవించవలసి వుంటుంది కాని ఆ సుఖం ఎప్పుడు? ముసలితనంలోనా?

జః మనషికి తృప్తివుంటే ఏ వయసులో నైనా సుఖాన్ని పొందవచ్చు.

ఎ. సూర్యనారాయణ. ఆముదాలవలస.

ప్రః ఆడదానికి కన్నీరు ఆయుధమంటారు, మీరేమంటారు?

జః ఏమో, నాకు మాత్రం కాదు.

జగన్నాథరావు విజయనగరం.

ప్రః ఇద్దరు మార్వాడీలు కలుసుకుంటే హిందీలోనే మాట్లాడుకుంటారు? ఇద్దరు సాహెబులు కలిస్తే ఉర్దులో మాట్లాడుకుంటారు-తమిళులు ఎపుడూ తమిళమే మాట్లాడుతారు. కాని ఇద్దరు తెలుగువారు కలిస్తే వచ్చీరానీ ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటారెందుకండీ.

జః మనకర్మ.

టి. గౌరీదేవి – యానాం

ప్రః మా బాబుకి చదువురావడం లేదు .ఏం చేయాలో తోచటంలేదు, మీ సలహా ఏమిటీ?

జః మీ బాబుకు ఎందులో అసక్తివుందో గ్రహించి ఆ విద్యకు ప్రోత్సాహమివ్వడం మంచిది. కొట్టడం తిట్టడం మాత్రం చెయ్యవద్దు .దాని వలన ప్రయెజనం కలగకపోగా బాబుని మొండివాణ్ణి చేసినవారవుతారు. ?

యాండ్రవు సత్యనారాయణ – గదెలవలన,

ప్రః ఆంధ్రలో మీరు నాటక ప్రదర్శనలు యిస్తామన్నారు. ఎప్పుడు?

జః 1968 లో.

దేవళరాజా సత్యనారాయణరావ్ – బందరు.

ప్రః ఇటీవల విజయవాడలో శ్రీ గుమ్మడి ఒక సభలో మాట్లాడుతూ “ కళాకారులకు ప్రభుత్వం తగినంత గౌరవం యివ్వడం లేదు ” అన్నారు… మీరేమంటారు?

జః ఆంధ్రప్రభుత్వం మాటగాదేమో వారన్నది. కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారనుకుంటున్నా-

కె. సూర్యనారాయణ. పిసిమికాడ.

ప్రః ఈ (ఆ) కలికాలంలో సన్యాసం మంచిదా? సంసారం మంచిదా?

జః ఇంకా వేరే సన్యాసం ఎందుకు?

సి. ఎస్ ఎన్. మూర్తి – కొయ్యాలగుడెం,

ప్రః కళారాధనే దృష్టిలో పెట్టుకుని నిర్మించే చిత్రాలు ఆశించినంత ఫలితం మరి పొందగలవా?

జః లేవు.

వై. ఆంజనేయులు గుంతకల్లు.

ప్రః స్త్రీ హృదయం సెలయేటి వంటిదంటారు కొందరు. నాతి హృదయం రాతివంటిదంటారు కొందరు. ఎందుకు?

జః నిర్మలమైనది కాబట్టి సెలయేరుతో పోల్చివుంటారు. నిశ్చిత హృదయిని కాబట్టి రాతితో తూచివుంటారు.

వై.వెంకటరత్నం పద్పపురం.

“ఎందుకు” శీర్షికలో పద్మనాభంగారు ఒక ప్రశ్నకు జవాబుగా “అరవ సాంబారుకు. ఆంధ్ర ఇడ్లకి పొత్తు వారికన్నా మీకే బాగా తెలుసునన్నారు , మరి ఆ సంబంధం ఏమిటో చెబుతారా?

జః “సాంబారు , ఇడ్లీ మనవిగానేగావు మన సంప్రదాయం పెసరట్ అండ్ ఘుమ ఘుమ ఉప్మా.

ఇ. టి. రామరావు కావలి.

ప్రః Experience is the best teacher అన్నారు గదా? మరి మీ సినీజీవితంలో మీరు నేర్చిన పాఠం ఏమిటో?

జః నా జీవితానికి కావలసినవి. నాకు తెలియనివి అన్నీ నేను సినీ జీవితంలోనే నేర్చుకున్నాను.

ప్రః నేడు ఉత్తమ చిత్రాలు రాక పోవడానికి ప్రేక్షకులు ఎంతవరకు భాధ్యులు?

జః సినిమా పరిశ్రమకు ప్రజాదరణే ప్రధానంగదా అందుకే ఏనాటి సినిమాలకైనా బాధ్యత పూర్తిగా ప్రేక్షకులదే.

అల్లంరాజు లక్ష్మీనారాయణ్. టిట్లాఘర్.

ప్రః మోడువారిన వృక్షాలు వసంతకాలంతో చిగురించి పుష్పిస్తాయిగదా? అలాగే మోడు వారిన హృదయాలు చిగురించే ఆశ లేదా మాధవిగారూ?

జః ఉంది… ఎందుకులేదు?

జి. పద్మావతీదేవీ. మద్రాస్ 35

ప్రః ఏమండి మా ప్రశ్నలకు మీరే స్వయంగా ప్రత్యుత్తరములిస్తున్నారా, లేక వేరెవరైనా మీ పేరున సమాధానాలిస్తున్నారా?

జః ఔనూ ఇంతకీ మీరీ ప్రశ్న మీరే వ్రాస్తున్నారా? ఎవరైనా మీ పేరుతో వ్రాశారా?

ప్రః మీ నాటక సమాజం ఏమయింది?

జః కొంచెం ఓపిక పట్టండి. వచ్చే సంవత్సరం నాటక ప్రదర్శనలివ్వాలని ఏర్పాట్లు చేస్తున్నాను.

పి. సాంబశివరావు. హైదరాబాదు.

ప్రః మీ వారికి తెలుగు మాట్లాడటం వచ్చా?

జః ఓ బాగా మాట్లాడుతారు.

బి. ఆర్. రావు – వైరా.

ప్రః మరి తెలుగు చిత్రాలలో నటించరేం?

జః ఆయనవరకు ఏ అభ్యంతరం లేదు.

బి. ఆర్. రావు – వైరా.

ప్రః ఒకసారి అమాయకత్వంలో పోగొట్టుకున్న హృదయంలో మరో సారి యింకొకరికి స్థానం యివ్వగలమా?

జః అంత సులభంగా పోయే హృదయం ఎన్ని సార్లైనా అల్లా పోగొట్టుకుంటూ,మరొ కరికి చోటు కలిగిస్తూనేవుంటుంది.

మిస్ ఎవడ్. బి. బిర్హంపూర్.

ప్రః వెంపటి సత్యం గారి వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకోవాలని వుంది. స్కాలర్షిప్ వచ్చేందుకు ఏర్పాట్లు చేయగలరా? యోగ్యత. అర్హత నాకున్నాయనుకుంటున్నా.

జః సత్యంగారి విద్యాలయం ప్రభుత్వ నిర్వహణలో లేదు; ప్రైవేట్ సంస్థ: స్కాలర్ షిప్స్ లేవు. ఆశ్రయించి ఉచితంగా నేర్చుకునే శిష్యురాండ్రు కూడా వున్నారు అక్కడ.

కె.యన్. అర్. సురేందర్. మంచిరియాల.

ప్రః స్త్రీల మనస్తత్వాలెలావుంటాయి?

జ. అతి సున్నితంగా వుంటాయి.

ప్రః స్త్రీ పురుషుల్లో ఎవరు కఠినాత్ములో నిజం చెప్పండి?

జ. నాతి హృదయం రాతి వంటిదని అన్నారొకరు ఇంతక్రితమే.

ప్రః స్త్రీ మనసు గ్రహించక ఆమెను ప్రేమిస్తే ఆమె నిరాకరిస్తే పురుషుడు ఎంత బాధపడతాడు. అలాంటపుడు స్త్రీ తన మనస్సు ఎందుకు మార్చుకోదు?

జః ఎదుటివాని మనస్సు తెలుసుకోకుండా తొందరపడడం మొదటి పొరపాటు. స్త్రీ మనసు మార్చుకోవాలనుకోవడం మరింత పొరబాటు.

రాగతీ పండరీభాయి, విశాఖపట్టణం.

ప్రః మానవుని జీవితంలో అతి సుఖమైన క్షణం ఏది?

జ. ఆత్మకి తృప్తి కలిగినప్పుడు.

ప్రః ఈ ప్రపంచంలో మానవుడు డబ్బుతో సాధించలేనిదేమిటి?

జః ఏమిటి? ఈ కాలంలోనా?

ప్రః మీరు జవాబివ్వలేని ప్రశ్న ఏది?

జ. అమ్మో తీరా చెప్పాక మీరు అడిగేస్తే?

డి. వెంకశ్వర్లు. వరంగల్.

ప్రః మీ అడ్రస్?

జః 11 హబీబుల్లా రోడ్ మద్రాస్. 17.

జంచాలి సన్యాసి రాజు. పార్వతీపురం.

ప్రః నటినటులు పాత్రలో లీనమై నటించడం మంచిదా? తమ పాత్రలను దృష్టిలో వుంచుకుని నటించడం మంచిదా?

జః రెండోదే కరెక్ట్.

ప్రః మీ వంటి సినితారలు నా కలలో కనిపించి నిద్రాభంగం చేస్తుంటారు; దానికి తరుణోపాయం?

జః మా కలల్లోకి మీరు రానంత వరకూ ఏ ప్రమాదమూ లేదు, గ్యారంటీ.

సి శ్యామల. హైదరాబాద్.

ప్రః ముద్దులు ప్రవేశ పెట్టాలా వద్దా అన్న విషయం ఎప్పటికి తేలుతుంది?

జః అంత తేలికగా తేల్చేస్తే మన కమిటీల ఘనత ఏముంటుందింక.

ప్రః పెద్దతారలంతా వద్దంటే ( ఈ ముద్దులు ప్రవెశ పెట్టడం) నిర్మాతలు. దర్శకులు ఏం చేస్తారండి – బహుశా పద్దతి రద్దు చేస్తారా?

జః చేయరు – అల్లా ఆంగీకరించే తారలతోనే చిత్రాలు తీస్తారు..

కమారి సునీత పట్నాయక్. బర్హంపూర్.

ప్రః మొన్నటి ఎన్నికల్లో ఓటిచ్చిన వారిలో అందరికన్న పెద్దవారెవరు మీ యింట్లో?

జః మా అమ్మమ్మ.

ప్రః గీతాంజలికి పద్మనాభానికీ ఈడూ జోడూ బావుంటుంది. మీరేమంటారు?

జ. గీతాంజలిని నడిగి చెప్తామరి.

మదాల అచ్చయ్య. చల్లపల్లి.

ప్రః అన్నా, చెల్లిలా వుంటున్న ఆ యిద్దరూ విడిపోయేటప్పుడు ఒకరికొకరు యివ్వవలసిందేమిటి?

జః ఆ సంబంధంలో “బంధం” మనుష్యులు విడిపోయినా అది వీడిపోదు,

ఒకరికొకరు ఆ అనుబంధం యిచ్చుకోవడమే.

యం.వరలక్ష్మి, పూలపల్లి.

ప్రః “ఆరాధన” చిత్రంలో మీ పాత్ర మరువలేను, అది నా జీవితాన్నే మార్చింది.

జః అనురాధ పాత్ర అల్లాంటిది,

పి. లక్ష్మి, నింపూరా.

ప్రః ఇంతమంది తెలుగువారుండగా, తమిళుని వివాహమాడారేం?

జః అనురాగానికి, అనుకూలతకు భాష అడ్డురాదుగా?

ఏ రాజబాబు, బందర్.

ప్రః మీపై ఎంతో గౌరవం వున్నా మీరు ధరించే ప్రతి పాత్రను నేను అభినందించలేను కంచుకోట చుస్తూంటే…..

జః బ్రదర్ ఆ అ భి మా నా ని కి thanks ఆ అభిప్రాయాన్ని కాస్త ఆ నిర్మాతక వ్రాయకూడదూ?

యస్. త్రివేణి, ఖర్గపూర్.

ప్రః మీరు నిర్మించబోతున్న చిత్రానికి మీరే కథ వ్రాస్తున్నారా?

జః లేదు, శ్రీమతి వి, సరోజని వ్రాసిందా కథ. ఆత్రేయ మాటలు వ్రాస్తున్నారు.

ఎం. సూర్య, జమలమడుగు.

ప్రః ఏ చిత్రంలోనైనా నీ పాత్రకు అన్యాయం జరిగితే నా కెంతో బాధ కలుగుతుంది ఎందుకని?

జః అత్మీయత ఆల్లాంటిది- అందుకని.

ఆర్, సాంబశివశర్మ, నై వేలి-2.

ప్రః మీకే పాత్రలంటే యిష్టం?

జః చిత్రంలో నేను ఏడవకుండా మిమ్మల్ని ఏడ్పించగలిగే పాత్రల పోషణ అంటే చాల యిష్టం.

కె. కె. ఆనందం. తిమ్మందర్ల.

ప్రః నాకు నటించాలని వుంది. మీ చిత్రంలో ఒక ఛాన్సు యిస్తారా?

జః ఈ చిత్రంలో ఆ ఆవకాశం లేదు. సారీ.

జి. ఉమకాంత్, వరంగల్లు,

ప్రః ఈ రోజుల్లో విలువగల వారెవరు?

జః నోరు పెట్టుకుని నెగ్గుకొస్తున్నవాళ్ళు.

బి. త్రినాథ్, బొబ్బిలి.

ప్ర. మీతో నేనొక చిత్రంలో హీరోగా నటించాలని ఆశగావుంది. మీరు ఒప్పుకుంటారా?

జః ఓ – నాకేమి అభ్యంతరంలేదు. పోతే, ఆ ప్రొడ్యూసరు, డిస్ట్రబ్యూటరు, అంగీకరించాలిగా.

పి. మహేష్. శ్రీకాకుళం.

ప్రః నటులకు, ప్రేక్షకులకుగల సంబంధం?

జః విద్యార్థులకు, పరీక్షధికారులకు గల అనుబంధమే.

ఎం. సి, రావు కొడాలి.

ప్రః ధనం, రూపం, గుణం. విద్య. అన్నీ వున్నా, మంచి కుటుంబంలో పుట్టినా, ఒక అమ్మాయికి వరుడి లభించడంలేదు. ఏం చేయాలి?

జః నక్షత్ర బలాలెలావున్నాయో, ఏమో? ఓ మాటు ఎవరికైనా ఆ అమ్మాయి జాతకం చూపించండి.

సాకా రాజేశ్వరి బరంపురం,

ప్రః భగవంతునికి అతి ప్రియమైన దేది?

జః నిష్కల్మషమైన ఆరాధన.

ఎన్. సంజీవరావు, కరీంనగర్.

ప్రః ఈ ప్రపంచంలో పరమ సత్యమేది? ఘోర అహింస ఏది? జరగరాని అపచారమేమి?

జః ఈ ప్రశ్న ఏమీ? ఈ సందేహ మేమి? ఈ రాత యేమి?

కె. వి. రమావేణుగోపాలరావు- సర్వరెడ్డిపాలం

ప్రః మీకు ఏ పార్టీ అంటే యిష్టమండి? కారణం చెప్పండి?

జః “టీ పార్టీ” అంటే గెట్‌ టుగెదర్లో కాలక్షేపం, కాఫి ఫలహారాలూ దొరుకుతాయిగా.”

జి. అప్పారావు, కుందంగి.

ప్రః నా జీతం 120 రూపాయలు. నాకు నలుగురు పిల్లలు, నేనెంత పొదుపు

చేయాలనుకున్నా మా ఆవిడ దుబారా మనిషయింది, ఎల్లా?

జః పొదుపుకు స్త్రీలు పెట్టింది పేరు. చెప్పి చూడండి నెమ్మదిగా, మీకంటె గొప్పగా పొదుపు చేయగలదేమో.

వి. యస్.రావు. కావలి.

ప్రః ప్రస్తుత ఆహర పరిస్థితిలో స్త్రీలోక బాధ్యతలు ఏమిటి?

జః దుబారా లేకుండా, “ ఎకనా మికల్” గా సంసారాలు నడపడం…

బి. కృష్టకుమారి – పాలెం.

ప్రః తల్లీ తండ్రీ, లేరు నాకు, చిన్న పాఠశాలలో పని చేస్తున్నాను. మా వాళ్ళంతా పెళ్ళి చేసుకోమని పట్టుపడుతున్నారు. నేను హీందీ చదువుకోవాలని తలుస్తున్నా. ఏమి చేయమంటారు?

జః పెళ్ళికి మీ హిందీ చదువు ఏమీ అడ్డం రాదుగా.

కుమారి దానరిరాజు, నూజివీడు,

ప్రః అమాయకురాలైన ఆడపిల్లపై అపనిందలు వేస్తే?

జః అమాయకత్వం పోగొట్టుకోవాలి ముందు.

సుధశ్రీ, రాజమండ్రి,

ప్రః నడిగియర్ తిలకమంటే?

జః నటీ శిరోమణి అని తెలుగులో చెప్పాలి.

జి. ఆర్ మౌళి- మంచిర్యాల.

ప్రః స్రుష్టిలో స్త్రీ ముందు పుట్టెనా? పురుషుడా?

జః ప్రకృతిని “స్త్రీ” గానే చెబుతారు పెద్దలు, ఈవ్ తర్వాతే యాడం – స్త్రీ తర్వాతే పురుషుడు.

ఎం. శేషారత్నం, మందమర్రి.

ప్రః తెలిసినవారు అంత దూరంలో వుండగానే ఒకరినొకర్ని చూచుకుని నవ్వుకుంటారేమండి?

జః మాటలతో పలకరించుకొనే అవకాశం లేక మనస్సుతో పలకరించుకనేందుకు అదే సాధనం మరి.

ఎ. లక్ష్మణకర్, బొబ్బలి.

ప్రః ఏదైనా ఒక కార్యం తలపెట్టి అపజయాన్ని పొందితే మనిషి తేరుకొ ని పూర్వంలా తిరగగలుగుతాడా?

జః అందుకే మనకి “మరుపు” యిచ్చాడు భగవంతుడు .ఆపైన మనో ధైర్యాన్ని మనం కలిగివుంటే ఆరోగ్యం.

కొత్త శివరామకృష్ణ ప్రసాద్, వేజండ్ల.

ప్రః ఈ ట్వంటియత్ సెంచరీలోని అప్ – టు డేట్ ఫ్యాషనబుల్ నవయువతులపై మీ ఆభప్రాయం?

జః మరి ఆ నవయువకుల మాటో?

యస్. గౌరీపార్వతి, మచిలీపట్నం.

ప్రః హిందీ చిత్రాల్లో నాచురాలిటీ తెలుగు చిత్రాలలో కనిపించదేం?

జః అదే ప్రశ్న నేనూ అడుగుతా – మన చిత్రాల్లోవున్న “నాచురాలిటి ” హిందీలో ఎక్కడవుందని?

యం. సుజావద్దీన్, ఇస్లాంపూర్,

ప్రః స్త్రీ ఇంటి దీపమా?

జః ఆః..ఇల్లాలే యింటికి దీపం.

ప్రః పెళ్లి ఎందుకు చేస్తారు?

జః సంసార జీవితం వుంటే సమాజ సంరక్షణ జరుదుతుందని.

ప్రః మీరు నటించిన, నటిస్తున్న హిందీ చిత్రాలేమిటి?

జః జాయ్ ఫిలిం “ బలరాం శ్రీకృష్ణ” లో నటిస్తున్నాను. “గంగాకి లహరే”, “ఘర్ బసాకే దేఖో ”, “ బహుత్ దిన్ హుయే” – మొదలయిన హిందీ చిత్రాలలో నటించాను.

పి. యస్. వి, సంజీవరావు. పాలకొండ.

ప్రః కళకారులు దేశాభివృద్ది కెంతవరకు బాధ్యులు?

జః సమాజానికి సినిమా ప్రతిబింబం. ఆ సమాజానికి చరిత్రకారులు కళాకారులే,అనుక్షణం మార్పులు వస్తున్న దేశ కాల వాతావరణాలను యథాతథంగా గుర్తించడానికి సినిమాలే ప్రత్యక్ష ఆధారాలు ఏనాటి కైనా.

హెచ్. ప్రసాద్. గుంటూరు.

ప్రః మీరు నిర్మించే చిత్రంలో నటీనటులెవరు?

జః జగ్గయ్య, జమున, జానకి, సూర్యకాంతం, రేలంగి, పద్మనాభం, బేబి రోజారమణి.

హెచ్. కె. ఆచారి. ఆదోని.

ప్రః తాను నటించే పాత్రలో లీనమై నటించాలా ,పాత్రకు జీవం పోస్తున్నాననే అనుభూతితో నటిస్తే బాగా నటిస్తారా?

జః రెండోదే కరక్ట్….

ప్రః నాటకరంగం, సినిమారంగం ఈ రెండిటిలో నటనౌచ్యితానికి ఏది బాగా దోహద పడుతుంది?

జః ఔచిత్య నిరూపణకు రెండూ ఒకటే.

ప్రః “మనసే మందిరం” మీ నటన నాకు బాగా త్పప్తినిచ్చింది.

జః ఏం ప్రయోజనం: నిర్మాతలను తృప్తి పొందించలేక పోయా.

కావలి వసంత. తంబళ్లపల్లె.

ప్రః అక్కా ఒక స్త్రీ అదృష్టం వలన ఉన్నత స్థితికి వచ్చినా, దురదృష్టం వలన దిగజారిపోయినా ఆమెను ఎక్కువగా పొగిడేవారు ఏడిపించే వారు స్త్రీలేగాని పురుషులు కాదంటాను. కారణమేమిటీ?

జః అదేగా, ఆడవాళ్ల బలహీనత.

సి, భారతీదేవి, వచ్చలతాడిపర్రు.

ప్రః లావు తగ్గుటకు చన్నీళ్ల స్నానం చేయుచున్నారా?

జః చన్నీళ్ళ స్నానం వల్లనే సన్నబడతాననుకుంటే మా యింట్లోవున్న ఫ్రిజడెరిలోనే కూర్చుందును.

యర్ర మల్లఖార్జునరావు. కొత్తపేట.

ప్రః మీరు మీ భర్తతో నటించేటప్పుడు ఏవిధమైన అనుభూతి పొందుతారు? మరొకరెవరితోనైనా నటిస్తుంటే ఎలాంటి అనుభూతి కల్గుతుంది?

జః నటించడానికి సెట్స్ మీదకు వెళ్ళితే పాత్ర స్వభావంతో ఆ దృశ్యంలో నటించవలసిన ఎమోషన్ తెచ్చుకొని వుంటాం. అప్పుడు ఎవరితో నటిస్తున్నా ఒకటే అనుభూతి. ఆ తేడాలుండవు.

కె. నీలకంఠం, సాలూరు.

ప్రః మాతా సంస్థకు మీరు దర్శకత్వం వహిస్తున్నట్లే చక్రవర్తి చిత్రాలకు నటసామ్రాట్ దర్శకత్వ బాధ్యత వహించ కూడదా?

జః నటసామ్రాట్‌గారే చెప్పాలి – నన్నడిగితే…

జి. కోటిరెడ్డి. బరోడా.

ప్రః బీహార్ క్షామనిధికి మీరేమైనా సహయం చేశారా?

జః స్టార్‌నైట్ జరిపి ఆ కలెక్షన్ పంపాం.

సి. గంగాధర్, భాన్స్‌వాడ.

ప్రః మీ ఆరాధ్యదైవం ఎవరండీ?

జః వెంకటేశ్వరస్వామి ,విఘ్నేశ్వరుడు.

ప్రః ఆడవారికి “ పువ్వు” లంటె అంతయిష్టం ఎందుచేత నంటారు?

జః పుష్పానికి పూబోడికి దగ్గర సంబంధాలున్నాయి మరి.

యుగంధర శ్రీ- హైదరాబాద్.

ప్రః నటజీవితంలో మీరు తెలుసుకున్నదేది? నేర్చుకున్నదేది?

జః కృషితో సాధించలేనిది ఏదీ లేదని.. ఆత్మ విశ్వాసంతో బ్రతకడం.

ప్రః విశాల విశ్వంలో అతి ఉన్నత మైనది, అతి నికృష్టమైనదేది?

జః పరుల గౌరవించడం, ప్రేమించడం! ఆత్మ స్తుతి- పరవింద.

సి.మహేష్. జగపతినగరం,

ప్రః జీవితంలో స్త్రీ ఎవరిని అమితంగా ప్రేమిస్తుంది?

జః తన భర్తను.

ఏ. కనక సుందరరావు – మంగళగిరి.

ప్రః చాలా,సార్లు నారాయణజపం చేస్తే పాపపరిహరం వుందా: కష్టాలు తొలిగి పోతాయా?

జః ఊహూఁ.

జి, సుదర్శనరెడ్డి – ఇస్సావల్లి.

ప్రః మీకు ఈత వచ్చునా?

జః బాగా వచ్చు.

ప్రః మీ విజయను ఆర్టిస్టు చేసే ఉద్దేశం ఉందా?

జః ఇంతవరకు లేదు,

ఆర్. అనసూయ – మందలపర్రు.

ప్రః నవరాత్రి చిత్రం తర్వాత మీరే చిత్రంలో నైనా మళ్ళీ పాడారా?

జః లేదు.

జి. బేబీలక్ష్మి- తెనాలి,

ప్రః మీ నట జీవితం, మీ ఆశయాల కెంతవరకు సహకరించ గలదంటారు?

జః జీవితంలో నేను తెలుసుకోలేనిది నేను నటించే పాత్రల ద్వారా తెలుసుకోగలుగుతున్నాను.

యస్. సత్యనారాయణ – మంచిరియాల.

ప్రః సినిమాలో కోడలుగా నటించడం మీకు తేలిక. నిత్యజీవితంలో ఎంతవరకు… ?

జః మీ దయ వలన మా అత్తగారు సూర్యకాంతమ్మత్తయ్య కాదులెండి.

బి. ప్రభాకరరావు , మంచిర్యాల.

ప్రః మీ సినిమా నటజీవితానుభవంతో మీ జీవితం గురించి ఒకే వాక్యంలో చెప్పాలిమరి?

జః An artist’s life is not a bed of Roses.

జె. కృష్ణకూమారి- ఆకిరిపల్లి.

ప్రః పిల్లలను సక్రమ పద్దతిలో వుంచవలసిన తండ్రే తప్పుడు దారినపడితే ఆ తండ్రి నేమనాలి?

జః అదే నిజమైతే – ఛ, అతను తండ్రికాదు.

టి. రత్నం- విజయనగరం.

ప్రః మద్రాస్ వస్తే నాతో మాట్లాడుతారా?

జః తప్పక … కేవలం మాట్లాడానికి మాత్రం అంత దూరం ప్రయాణం పెట్టుకోవద్దు.

టి. రవీంధ్రనాథ్, కర్నూలు.

ప్రః ఇతర నటీనటులపై మీకు ద్వేషం వుంటుందా? ప్రేమ వుంటుందా?

జః బలేవారే? అదేమిటాప్రశ్న… ఆ సందేహం ఏమిటి?

ఎం. తేజొపతి-తిరుపతి.

ప్రఃమీరు తెలుగువారై వుండి తమిళుని పెళ్లాడారు – మీకు తగిన అందగాడు, సంస్కారి, నటశేఖరుడు తెలుగువారిలో లేరనా? మరి శ్రీ జెమినీలో వున్న ప్రత్యేకత, సద్గుణాలు ఏమిటో?

జఃమీ ఆందరికీ మీ అభిమాన నటిగా యింత వరకు వుండగలిగానంటే దానికి వారు కూడా ఒక ముఖ్యకారకులు.

పొలిమేర రామారావు – అనకపల్లి.

ప్రః నాకు కథ వ్రాయాలని వుంది.

జః కాగితం , కలం వుందిగదా అనా? బుర్ర కూడా అవసరం మరి.

కె. చంద్రశేఖర్, కాకినాడ.

ప్రఃనేను ప్రేమించిన అమ్మాయికి ఏ లోపమూ లేదు, కాని మీలా లావుగామాత్రం వుంటుంది. వివాహం చేసుకుందామనుకుంటున్నాను. ఏం చేయమంటారు?

జః దగ్గర్లోనే సైకిల్ షాపుంటే చూడండి, గాలి కొడితే మీరు లావెక్కొచ్చునేమో?

ఆరసివెల్లి సత్యవతి, చినవాల్తేరు.

ప్రః ఉత్తమమైన ఈ మానవజన్మ దొరకడమే చాల కష్టమంటారుగదా: అలాంటి జన్మను సద్వినియోగం చేసుకోరెందుచేత?

జః స్వార్థమనే మబ్బుతెరలు దిట్టంగా పట్టేయడం వలన.

బి. కృష్ణమూర్తి. కొత్తగూడం.

ప్రః మీరు అన్నిచిత్రాల్లో విషాదకర పాత్రలే నిర్వహించి ఏడుస్తూ, ఏడిపిస్తూంటారు, మీ చిత్రాలుచూచి ఎల్లాగో అయిపోతాము. తేలిక పాత్రలు నిర్వహించలేదా? నిర్వహించరా?

జః నటికి అన్నీ ఒకటే, ఆ ప్రశ్న తెలుగుచిత్ర నిర్మాతల నడగండి.

జి. ఎం. వి, సుబ్బారావు. తాడేపల్లి గూడెం.

ప్రః మనిషికి దేనివలన “గర్వము” వచ్చును?

జః ఇది రెండు రకాలుగా రావచ్చు. విజయ సాధన వలన వచ్చేది ఒకటైతే,విర్రవీగటంలో
మిగిలేది మరొకటి.

ప్రః ఇల్లాలి ముచ్చట్లు ఎపుడూ పురాణం సీత గారే వ్రాయాలా మేంవ్రాసి పంపితే ప్రచురించే అవకాశం లేదా?

జః అవకాశం తప్పక వుంటుందని నా అనుమానం . ఎడిటర్ గారికి వ్రాయండి ఈ విషయం.

కె, విజయ, అనకాపల్లి.

.ప్రః వివాహమయి పిల్లలుగల జెమినీ గణేశన్ గారిని మీరు పెళ్లాడారు . దావివలన తోటి స్త్రీకి అన్యాయం చేసినట్లు కాదా.

జః దక్షిణాదిన ఓ కథ వుంది ప్రచారంలో. విఘ్నేశ్వరుడికి సిధ్ధి , బుధ్ధి అని యిద్దరు భార్యలట , అలాగే మా గణపతి (గణేశ ) గారికి కూడా.

ప్రః అవివాహితులైన అందమైన యువకులు మీకు లభించలేదా?

జః నా కళ్ళకు లభించలేదు.

వజ్జె జాన్ లక్ష్మణరావు , మచిలిపట్నం.

ప్రః నేను ఈ లోకాన్నిచూచి ఎందుకు భయపడాలి?

జః ఔను , ఎందుకు భయపడాలి?

ఎల్,ఎస్.మహలక్ష్మా, బందరు.

ప్రః ఎన్నివున్నా మనస్సులో విషాదవారం తప్పడంలేదు ఎందువలన?

జః తృప్తి అనేది వుంటే విషాదం వుండదు. ఆశాభంగమూ వుండదు.

పి. సునీత పెదప్రోలు.

ప్రః …………………………………

జః మీ బాధ అర్థమయిందిః ఆంధ్ర మహిళా సంస్థలో ఏదైనా ట్రైనింగ్ అవండి.

జి, విశ్వనాధం కాళహస్తి,

ప్రః ఉత్తమ నటి లక్షాణాలు ఏమిటి?

జః తనకిచ్చిన పాత్ర అర్ధం చేసుకుని నటించడమేగాక, ఇక్కడి చిత్ర పరిశ్రమ సాధక బాధకాలు కూడా తెలుసుకొని మసలుకోగల వారే ఉత్తమ శ్రేణికి చెందిన నటీనటులు.

జి. గంగరాజు పార్వతీపురం.

ప్రః నేటి సినిమాలు విద్యార్థుల నైతిక క్రమ శిక్షణ పాడుచేస్తున్నాయంటాను. మీరేమంటారు?

జః నేననుకోవడం ఈ యువకులవలనే నేటి సినిమాలింత పాడవుతున్నాయని……..

కేశవ ప్రభాకర్ కొవ్వూరు.

ప్రః మీకు కాబోయే అల్లుడికి కావలసిన అర్హతలు తేలియజేస్తారా?

జః అల్లుడి సెలక్షన్ రోజులు కావుయివి. “ఆయనే” సెలక్షన్ డైర్ క్ట్ గా, అయినా మా అమ్మాయినడిగి చెప్తానుండండి…..

పద్మాలయ పండాజగదేవుపురం.

ప్రః స్త్రీలకు విద్య ఎంతవరకు అవసరం?

జః సామాన్య పరిజ్ఞానం సముపార్జించి లోకాన్ని అర్థం చేసుకునే వరకు…….

బి. ఎన్ . కె. పండా , కాశీబుగ్గ.

ప్రః మీరు ఎన్. టి. రామారావుగారితో నటించిన చిత్రాల్లో మీకు పూర్తిగా నచ్చిన చిత్రం పేరు చెప్పగోర్తాను.

జః మిస్సమ్మ , రక్తసంబంధం.

సింగము నూకరాజు . అనకాపల్లి.

ప్రః స్త్రీ పురుషులెవరైనా సరే ప్రేమసాగరములో పడిన తర్వాత ఎన్ని కష్టాలొచ్చినా భయపడరెందుచేత?

జః నిండా మునిగారుగా మరి.

ప్రః మీకు డిటెక్టివ్ సాహిత్యం యిష్టమేనా?

జః ఇష్టంలేదు.

ఎన్. గపూరి. నందికొట్కూరు.

ప్రః “మనసే మందిరం” చిత్రంలో మీపాత్రను చూస్తూంటే కన్నీరు పారింది మరి మీకో?

జః షూటింగ్ జరిగిన ఆ నెలరోజులు ఏడ్చి,ఏడ్చి కళ్ళు, మొహం వాచిపోయాయి నాకు.

ఎం . కమల . పేరాల.

ప్రః త్రాగుడుకు ఎందుకు దాసులై పోతారో?

జః కాసేపైనా గంధర్వులై దేవలోకంలో తేలిపోదామనేమో.

కోనారి బాబురావు . ఖర్గపూర్.

ప్రః వయసులో వున్న యవకుణ్ణి చూడగానే , యువతులు తమ చేతుల్లోవున్న చంటిపిల్లను గట్టిగా ముద్దు పెట్టుతుంటూ వుంటారు, ఎందుచేత?

జః ఇదేదో కొత్త అనుభవంలా వుందే.

నందిగామ కాశయ్య. హుజూరీన్సరి.

ప్రః సుఖదుఃఖములతో కూడిన ఈ మానవ జీవిత సందేశం ఏమిటి?

జః వాటికతీతులై బ్రతకమని.

యస్, కృష్ణమూర్తి భువనగిరి.

ప్రః మీ ప్రోత్సాహముంటే విలన్ గా చిత్రాల్లో నటించాలని వుంది.

జః శ్రీ మాతాఫిలింస్ 9. ఫస్ట్ క్రాస్ స్ర్టీట్ మౌబరీస్ రోడ్ . మద్రాస్ 18 కి పోటో, ఉత్తరం వ్రాయండి . మీ అదృష్టం ఎల్లాంటిదోమరి.

ఎం, లింగనాయుడు పిసినికాడ,

ప్రః శీతాకాలంలో కుడా విద్యార్థులు క్లాసులోకి రాగానే కాలరు ఎత్తి చొక్కా బొత్తాలు తీసి కాలర్ పైకి ఎత్తుతుంటారు. ఫోజా? సాటి విద్యార్దినులనాకర్షించడానికా?

జఃకాలర్లెత్తే వారికి ఓకాలమనేముంటుంది.

వెంకటేశం తిమ్మనచర్ల.

ప్రః ఆస్తినంతా చదువుకొసం ఖర్చుచేసిః,డిగ్రీ తెచ్చుకుని ఉద్యోగం దొరక్క ఉసూరుమనే వారికి మీ సలహా ఏమిటి?

జః చదువుకు సార్థకం తెలిపి , బ్రతుకుతెరువుకు ఉద్యోగం ఒక్కటే మర్గంకాదుగా,సుజనాత్మక శక్తి వుంటే ఎల్లాగైనా బ్రతకవచ్చు. ఏ వృత్తిలోనైనా రాణించవచ్చు.

లింగం పట్టాభిరామయ్య , అక్కయ్యపాలెం

ప్రః నేటి చిత్రాలను చూస్తూవుంటే నిర్మాతలు ప్రజాభిప్రాయాన్ని గుర్తించడం లేదని నేనంటే మీరంగీకరిస్తారా?

జ.ప్రజాభిరిచులు త్వరత్వరగా మారి పోతూండడం వల్లనే నిర్మాతలు ఇల్లా యిబ్బంది పడిపోతున్నారు.

ప్రః జంటతనంలొ అనురాగమును, అభిమానమును పెంపొందుంటకు పెద్దలు పెళ్ళి అనే జీవిత బంధాన్ని స్త్రీ పురుషులకేర్పరచారు . నిజమేనంటారా?

జః ఆనాడు వంశవృక్షం పెరగాలనుకొని పెట్టారా నిబంధన . ఈనాడది విషమించింది. కుటుంబ నియంత్రణ అమలు చేసుకోవలసి వస్తోంది.

ప్రః మనిషికి , మనిషికీ మధ్య మమతలు నశించి మానవుడు దానవుడిలా తయారౌతున్నాడు నేటి సంఘంలో ఔనంటారా?

జః తనపై తనకు మమత పెంచుకుంటున్న తరుణంలో స్వార్థ జీవనం తప్పదు ఏ సంఘంలో నైనాసరే.

మేకల మాధవరావు ,చందర్లపాడు.

ప్రః మీ విజ్జిని పెళ్ళి చేసుకోవాలని వుంది.

జః హుహుహ్హూ……………….

ఎం. వి. యస్. రావు కొత్తగూడెం.

ప్రః మీరు సినిమాలలో నటించాలని ఎందుకు కోరుకున్నారు?

జః మీ అందరిచేత మెప్పులు పొందాలని……..

ఎం రుక్మిణీదేవి పరిటాల.

ప్రః మానవుడు జీవితాంతం వరకు ప్రశాంతంగా గడపాలంటే ఏం చెయ్యాలి?

జః తృప్తికలిగి ఆవేశాలకు లొంగక బ్రతక గలిగితే చాలు.

వై . వెంకటేశ్వరరావు. మాచెర్ల.

ప్రః కళ అనగానేమి?

జః ఎంతటి వారినైనా కొంతసేపు మరపించి మురిపించగల దేదైనా ఒక కళే , సమాజ పురోభివృద్దికి కళావికాసం ఎంతో ముఖ్యం.

ప్రః కళాకారిణిగా సమాజానికి మీరెంతవరకు తోడ్పడుతున్నారు?

జః కళా ప్రపంచంలో సినిమా ఒక చిన్నభాగంమేగా, అందుకే నా చేతనైన సేవ చేస్తూ మీవంటి అబిమానులనానందింప చేస్తున్నాను..

ప్రః మీవంటి నటీమణులంతా ఏకమై తెరపై సెక్స్ కు వ్యతిరేకించి దర్శక నిర్మాతలకు నిర్మొమొహమాటంగా చెబితే వాళ్లు కళ్ళు తెరుస్తారనుకుంటా. మీరాపని ఎందుకు చేయకూడదు?

జః అక్కడే పొరబడుతున్నారు మీరు. అంతా ఏకమై నిర్మొహమాటంగా చెప్పవలసింది మేము కాదు, మీరు. మీరు ఏది కోరితే అది చేయడమే చిత్ర నిర్మాణంలో జరుగుతోంది గదా.

ఎస్. మరళి మచులీపట్నం.

ప్రః ఒదినా మరిది, ఈ ఇద్దరి అనురాగమోలా వుండాలి?

జః అక్కా తమ్ముడుగా , తల్లీ కొడుకుగా…..

కుమ్మల శివరామకృష్ణారావు. కొడాలి.

ప్రః మీకు అరవ నటులతో నటించినపుడు హాయిగా వుంటుందా లేక తెలుగువారితో నటించినపుడు హాయిగా వుంటుందా?

జః నటనకు భాషా భేధాలుంటాయనుకోటం శుద్ధ పొరపాటు మేం నటించిన చిత్రాన్ని చూచి మీరు మెచ్చుకుంటేనే మాకు హాయి అనిపిస్తుంది.

గుడ్ల శ్రీరామమూర్తి. రాయగడ.

ప్రః నేనొక హీరోయిన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని వుంది మీ సలహా యేమిటి?

జః మద్రాస్ లో మారేజి సీజన్ అయిపోయింది….మరెక్కడైనా ట్రై చేయి తమ్ముడూ.

కె. గిరిజాకుమారి . నరసరావుపేట.

ప్రః భారతనారి పై అభిప్రాయం ఏమిటి?

జః ఆ నారీలపై అభిప్రాయాన్ని తెలిపితే నేటి లోకం ఆ పై నారి సంధిస్తారు……

మావూరు కాళిదాసు , పాత శ్రీకాకుళం.

ప్రః మీరు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఎంతవరకు వచ్చింది?

జః పేపరు వర్కు పూర్తయింది . విజయ దశమికి సెట్స్ మీదకు వెళ్తోంది.
పత్తి అదృష్టదీపన్.

ప్రః మనదేశంలో చిత్ర పరిశ్రమను జాతీయం చేస్తే ఎల్లాగుంటుంది?

జః దానివలన స్వేచ్ఛ పోతుందని కొందరి అభిప్రాయం.

ప్రః సినిమాల్లో నటించాలనే వెర్రి ఆవేశంతో మద్రాస్ వచ్చి అక్కడ నానా అగచాట్లు పడుతున్న యువతీ యువకులకు మీరిచ్చే సందేశమేమిటి?

జః చెడి చెన్నపట్నం చేరుకునేది పూర్వపు సామెత.చెన్నపట్నం చేరి చెడిపోతున్న వాళ్లు యిప్పుడు. వీరంతా ఏ అధారం ,ఆసరా పూర్తిగా లేకుండా ,కేవలం పగటి కలలు కంటూ యిక్కడికివచ్చి ఇలా అగచాట్లు పడడం సమంజసం కాదు.

ఆర్. జె. రాజు బాపట్ల.

ప్రః మీ దర్శకత్వంలో ఒక చిత్రం తయారవుతోందిటగదా . అది విజయంకాగానే మీరు చిత్రాలలో నటించడం మానేసి దర్శకురాలిగా స్థిరపడటం చాలా సమంజసంగా వుంటుంది ఏమంటారు?

జః కాలాన్నిబట్టి నిర్ణయాలుంటాయి.

ప్రః మీ అభిమాన శ్రోతలకు మళ్ళీ మీ పాటవినే అదృషం ఎప్పుడు?

జః ఆ అవకాశం నాకు లభించినప్పుడు

పి. సౌజన్య విప్పన్నపేట.

ప్రః తిరుపతిలో సంభవించిన ప్రమాదానికి మీ దృష్టిలో దోషులెవరు?

జః ఎవరిదీ దోషం అనేందుకు వీలులేదు . అంతా విధి.

ప్రః మీ దర్శకత్వంలో తయారౌతున్న చిత్రం పేరేమిటి?

జః చిన్నారి మనసులు.

ప్రః మీరు ఏదైనా ఒక నవల వ్రాయకూడదా?

జః నవలా …నా వల్ల కాదు..ఇప్పట్లో.

ఎన్ .వి. ఆర్ జోగారావు అనకపల్లి.

ప్రః నేటి సమాజంపై సినిమాల ప్రభావం ఏమిటి?

జః నేటి సినిమాలు ఈనాటి సమాజానికి దర్పణాలు.

ప్రః పత్రికా రంగానికి చలనచిత్ర రంగానికీ గల సంబంధం ఎట్లాంటిది?

జః ప్రతి రంగానికి పత్రికా రంగంతో వున్న సంబంధం లాంటిదే.

ప్రః జకార్తా పర్యటన మీకు నేర్పిన అనుభవం ఏమిటి?

జః అక్కడ మనం నేర్చుకోవలసిందేమీ కనిపించలేదు . మనం నేర్పించిరావాలి.

ప్రః శృంగారరస ప్రధాన చిత్రములు జయం పొందినంతగా ఇతర చిత్రాలు జయం పొందడం లేదు.

జః అభిరుచులు మారటమే.

రావుల సరోజ , విజయవాడ.

ప్రః మీరు సీనీ జీవితంలో ప్రవేశంచి ఎన్ని పంవత్సరాలయింది?

జః మే 17 వ తేది 1950 సంవత్సరంలో.

ప్రః ఆ కళామతల్లి నేర్పిన పాఠాలేమిటి?

జః ఆ శిక్షణ ఈనాటి కళ కు పనికిరావటం లేదు .( దానికి నా లావు అడ్డు అనుకో కండేం.)

ప్రః సినిమా అంటే ఏమిటో నిర్వచించండి?

జః లలిత కళల సమగ్ర సంగమం సినిమా.

ఎం . శేశగిరిరావు .

ప్రః ఇంటిదగ్గర ఎంతో సుఖ సంతోషాలతోవుంటూ చిత్రాల్లో విషాద పాత్రలంత గొప్పగా ఎల్లా నటిస్తారండి?

జః ఆ రోజుల్లో క్రమశిక్షణతో మేం నేర్చుకున్న విద్యాఫలితం.

విథాభారిత కృష్ణమూర్తి , పెద్ద కన్నలి.

ప్రః స్త్రీ కోరేదేమిటి?

జః ఏ ఒడుదుడుకులు లేకుండా తన సంసారం సాగిపోవాలని…

ప్రః స్త్రీని సంతృప్తిపరచేదేమిటి?

జః తనను అర్థం చేసుకున్న అనుకూలమైన భర్త దొరకడం.

ప్రః స్త్రీ కి వుండవలసిన దేమిటి?

జః అణుకువ , మెలకువ , వినయం ,విధేయత.

యన్ .శ్రీశైలం. హైదరాబాద్.

ప్రః ఈ మధ్య మీరు సినిమాలలో కనిపించడం లేదేం తరచుగా?

జః సన్నపడ్డాక కనిపిద్దామని.

పి,బి,టి యస్. సుందరి, హైదరాబాద్.

ప్రః మీ హెయిర్ స్టయిల్ చూసి నేనూ అలా వుండాలనుకున్నా. అమ్మలక్కలు మరి ఊరు కోవడం లేదు . ఏమిటి సాధనం?

జః ముఖాన్ని బట్టి శిరోజాలంకరణ… మీకేది నప్పుతుందో మరి.

డి . సీతారామలక్ష్మి . కావలి.

ప్రః మీకు ఏ పువ్వులంటే ఇష్టం ?

జః మల్లెపువ్వులు.

ప్రః మీరు మీ భర్తను పేరుతో పిలుస్తారా?

జః ఊహూ….

శీది రామాస్వామి . భువనేశ్వర్.

ప్రః మధ్యపాన నిషేధాన్ని తొలిగిస్తే అన్ని సమస్యలు సగం తీరిపోతాయా?

జః అంతా ప్రభుత్వం చేతుల్లో వుంది.

ముమ్మెన హనుమంతురావు , నర్సీపట్నం.

ప్రః తెలుగుచిత్రాల్లో తరచు కనిపిస్తూ మీరీ మధ్య మీ అభిమానులకు ఆశాభంగం కలిగిస్తున్నారు కారణం?

జః సర్లెండి , తరచుగా కనిపించడం లేందే?

ఎం , వి చూదరి సెద్దవూం.

ప్రః ప్రస్తుతం మీరు నటిస్తున్న చిత్రాలు ఏమిటి?

జః ఆజామ్ ఆర్ట్సవారి తెలుగు చిత్రం “భక్త విజయ” “తిరుమాళ సేవై “ అనే రెండు ఈస్ట్ మన్ కలర్ తమిళ చిత్రాలు , నా స్వంత చిత్రం మూగమనసులు (తమిళం).

వదిపర్తి కృష్టారావు , సర్వశిద్ది.

ప్రః మీ సంతానం ముగ్గురవగానే ఫామిలీ ప్లానింగ్….

జః అందాకా ఆగలేదు . ఇద్దరితోనే ఫుల్ స్టాప్……

పూలపల్లి రాజారావు . కానుయకుంట.

ప్రః అన్నపూర్ణావారి అన్ని చిత్రాల్లో నటిస్తున్న మీరు “పూలరంగండు”లో లేరేం?

జః నాకేం తెలుసు?

ప్రః మీ స్థానాన్ని శ్రీమతి జమున ఆక్రమించుకున్నారా అక్కడ?

జః ఒకరి స్థానాన్ని మరొకరు ఆక్రమించుకోవడం అనేది యిక్కడ వుండదు.

ప్రః మీ దర్శకత్వంలో తీయబోతున్న మీ చిత్రంలో ఎన్. టి.ఆర్ నుబుక్ చేసి, మీ యిద్దరూ ఒకరినిమించి ఒకరు నటిస్తే చూడాలని వుంది.

జః సారీ, నేను నటించడం లేదా చిత్రంలో.

కుమారి నఠలత, అంగలూరు.

ప్రః కళారాధన జీవత వికాసానికి ఎంతవరకు తోడ్పడగలదు?

జః జీవిత వికాసానికి కళ కూడ ఒక ముఖ్య సాధనే అని నా వ్యక్తిగతమెన అనుభూతి.

ప్రః చలనచిత్ర పరిశ్రమాభివృద్దికి ప్రభుత్వం ఎంతవరకు తోడ్పడాలంటారు?

జః అనవసరపు టాక్స్ లతో అణగద్రొక్క కుండా వుంటేచాలు.

వేళబోయిన గిరిజమ్మ. గుత్తి.

ప్రః గాంధిజీ , నెహ్రూల ఆధ్యాత్మిక శక్తులు ఎటువంటివి?

జః బాపూజీది పొలిటికల్ ఫిలాసఫి, నెహ్రూజీది ప్రాక్టికల్ ఫిలాసఫి… బాపూజీ అనునయుడే నెహ్రూజీ.

ఎస్ . వసుంధరా రాజన్ . తెనాలి.

ప్రః సంధ్య తన కూతురు జయలలితను సినిమా రంగంలో ప్రవేశ పెట్టింది . మీరు కూడా విజయను అలాగే చేస్తారా?

జః ఆబ్బో అది యింకా ఎప్పటి సంగతిః ఆలోచించేందుకు చాలా టైముంది.

ఎల్ . నిర్మలా

ప్రః హిందీ తారలంతా సన్నగా నాజుకుగా వుంటారు , మన తెలుగు తారలు రోజు రోజుకి లావెక్కి పొతారేమిండి?

జః టున్ టున్ తెలుగుది కాదే , మన తెలుగు తారల అందరిని మించిన మహ కాయురాలామె.

ప్రః సినీపరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఆ పరిశ్రమలో వారి కర్తవ్యం ఏమిటి? ప్రేక్షకుల కర్తవ్యం ఏమిటి?

జః ఈ పరిశ్రమలోకి వచ్చేముందు ,వచ్చాక, బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తించడం ఇక్కడ వారి ధర్మం.
ఈ పరిశ్రమ సాధకబాధకాలు తెలుసుకుంటూ ఉత్సాహపరచడం అక్కడ మీ ధర్మం

సి. రాములు . నల్గొండ.

ప్రః సినిమాల్లో లభించే ఆత్మీయత అనురాగం. నిజ జీవితంలో ఎంతవరకు లభిస్తాయి?

జః నిజ జీవితంలో వున్నదాన్నే అతిశయింప జేసి అబినయించి సినిమాలలో చూపుతారు.

జి కామేశ్వరరావు బొబ్బిలి.

ప్రః మానవుడు తన దేహన్ని ఎప్పుడు చాలిస్తాడో తనకే తెలియదు గదాః మరి బ్రతికి నంతకాలం మంచి పనులు చేయడు , ఎందు చేత?

జః బ్రతకాలన్న తాపత్రయం వలన.

ప్రః పద్నానాభంగారివలె మీరు కూడా మంచి ప్రశ్నకు పది రూపాయలు ఇస్తారా?

జః ఇవ్వం-

జి. వి, అంజనేయులు , తెనాలి

పః మీ జీవితంలో అదృష్టం ఎలాంటిది?

జః కృషి , ఆత్మవిశ్వాసం, అవే నా అదృష్టాలు.

రాయనపాడు బాబు , కృషలంక.

ప్రః ముగ్గురు బిడ్డలగన్న తదుపరి గర్బిణి స్త్రీకి ఆస్పత్రిలో అనుమతి యివ్వరాదనే ప్రభుత్వ ఆలోచనపై మీ అభిప్రాయం ఏమిటి?

జః మూడు కాన్పులు జరిగాక ,ఆ అనుభవం తెలిశాక ఇంట్లోనే పురుడు పోసుకో వచ్చుగా అనేమో.

రేవాటి అప్పారావు , గొల్లప్రోలు.

ప్రః ఆంధ్రజ్యోతిలో మీకు షేరులు ఉన్నాయటగా?

జః నిజంగానా, బాగా గుర్తు చేశారే.

బొడ్డేడ వెంకట శివసత్యనారాయయణ . అనకాపల్లి.

ప్రః స్త్రీకి విలువ యివ్వలేని సంఘం నాశన మవుతుందన్నాడు “మరపురాని కథ” చిత్రంలో . సంఘంలో స్త్రీకంత గౌరవం ఎందుకివ్వాలి?

జః చెప్పారుగా సంఘం నాశనం కాకుండా వుండటానికన్నమాట.

దాలిపర్తి లలితకుమారి . కొడాలి.

ప్రః మీ సహనటి మీ కంటే వృద్ధిలోకి వస్తే మీరు ఈర్ష్యపడతారా?

జః సాటివారు మేటివారు కావాలనే నే అభిలషించేది . ఈర్ష్యాసూయలు మన ఒంటికి
పడవు చెల్లీ.

ఏ , రామారావు , హైదరాబాద్.

ప్రః సినిమా జీవితానికి ,నిజ జీవితానికి తేడా ఏమిటి?

జః నిజ జీవితంలో నిజం వుంది . సినిమా అంటేనే నీడ గదా.

చందక అప్పారావు , బొబ్బిలి.

ప్రః సినిమాలు చూచుట వలన చెడి పోవుటకు అవకాశం వుందని కొందరి అభిప్రాయం. కాని సినిమాలు యింకా వృద్ధి కావాలని ప్రముఖుల ఆభిలాష, మీ అభిప్రాయం?

జః సినిమాల వలన చెడతారంటే నేనెప్పుడూ అంగీకరించను. సినిమాలు ప్రభుత్వా నికి. ప్రజలకు సంఘానికి . అనేక నిధాల తోడ్పడుతుంది. అభివృద్ది చెందితే దేశాని కెంతో మేలు.

పి. పోలేశం. హుజూరాబాదు.

ప్రః మీరు కాంతారావుకతో నటించిన చిత్రాలున్నాయా?

జః లేకేం ,”ప్రతిజ్ఞ”, “రక్తసంబంధం” , “తోబుట్టువులు” మొన్నటి “కంచుకోట”.

ఆంజిశ్రీ , మిర్యాలగూడ.

ప్రః నేనొక సాంఘిక నవల వ్రాశా .మీకు అంకితం యివ్వాలని వుంది . స్వీకరిస్తారా?

జః ఆ అంకితం నాకే యివ్వాలనుకునే దానిలో అభిప్రాయం ఏమిటో తెలిపితే, ఆ తర్వాత అలోచిద్దాం . పైగా ఆ నవల కూడా చూడాలిగా.

నడపూరు నాగభూషణరావు, ఆల్లిపురం.

ప్రః గృహిణిగా , నటిగా , చిరస్మరణియమైన మీ మధురస్మృతులు ఒకటో రెండో చెప్పరా?

జః నటిగా పనికిరాదన్న నాకు మీరిచ్చిన ప్రోత్సాహాన్ని నా నట జీవితంలో ఎన్నటికి మరచిపోలేను . వివాహం చేసుకున్న తర్వాత నేను నటిగా వుంటూ గృహ జీవితాన్ని చక్కగా సరిదిద్దు కోవాలన్న కోరికను నేను సఫలతదిందించు కోగలిగాను , దాన్ని మరువలేను .

ప్రః విద్యార్థులకు మీరిచ్చే సలహా?

జః క్రమశిక్షిణతో , ఏకాగ్రతతో విద్యాభ్యాసం పూర్తి చేయమని..దేశ భవిష్యత్తు మీ మీదే ఆధారపడి వుందని మరచి పోవద్దని.

కొత్తనాగేశ్వరరావు , వేజెండ్ల.

ప్రః మీ నటన పై విమర్శ పంపితే….?

జః తప్పులు దిద్దుకుని Thanks చెబుతా.

వై . రామ్మోహన్ వర్మ .తిరుపతి

ప్రః నేడు వస్తున్న చిత్రాలు ముప్పాతిక వంతు ప్రజాభ్యుదయానికి గాక ప్రజానాశనానికి తోడ్పడుతున్నాయి . మీరేమంటారు?

జః మూడు వంతులు మాత్రమే మీ మాటతో అంగీకరిస్తా.

ప్రః నటన అనునది పుట్టుకతో అదృష్టం వలన లభిస్తుందా సాధనతో అలవడుతుందా?

జః నా అనుభవంలో సాధన వలనే.

యస్ . నాగయ్య . ఖమ్మం.

ప్రః నేటి ప్రేమ వివాహాలు మంచివేనంటారా?

జః మంచివి కావు అని చెప్పలేం…..అటూ యిటూ వుంటున్నాయి.

యన్ . వెంకటేశ్వర్లు , దామెర.

ప్రః మీ ముక్కుకు రెండు మూడు సార్లు ఆపరేషన్ చేశారట నిజమా?

జః అబ్బో ఎప్పటిమాట. 8 సంవత్సరాల క్రితం సైనస్ ట్రబుల్ వలన పంచర్ చేశారు రెండుసార్లు. ఆపరేషన్ కాదు.

కె. యం. హెచ్ . హేమలత, బాపట్ల.

ప్రః స్త్రీ తన జీవితంలో ఎప్పుడూ పురుషునికి లొంగి వుండవలసిందేనా ?

జః ఎప్పుడూ వద్దు అనుకున్నా – కొన్ని సమయాల్లో మరి తప్పదు….. అంతే.

అనుమకొండ సాయిబాబు , విజయవాడ.

ప్రః మన ప్రధాని ఇందిరాగాంధిగారి పై మీ అభిప్రాయం ఏమిటండి ?

జః వారినీ మధ్య మద్రాస్ లో కలుసుకొని మాట్లాడే అవకాశం కలిగంది నాకు. అన్నింటా ఆ తండ్రికి తగిన బిడ్డ…. మన దేశానికి ఒక మాణిక్యం.

ఎం విశ్వనాథం , మచిలీపట్నం.

ప్రః తెలుగు చిత్రాల్లో ముద్దులు ప్రవేశబెడితే తారలు అంగీకరిస్తారా ?

జః తారలమాట ఏమోగాని అర్టిస్టులంగీకరించలేరు.

పి.వి రావ్ . విజయవాడ.

బొంబాయిలో బ్లాక్‌మనీ పట్టుకున్నారు కాని మద్రాసులో పట్టక పోవడానికి కారణం చెప్తారా?

జః ఇక్కడ లేదు గనక….

కె. లక్ష్మసుందరి , పెద్దాడ.

ప్రః సంసార జీవితము,సినీ జీవితం.ఈ రెండింటీలొ మీకేది మధురంగా తోచింది?

జః దేనికదేః ఆ రెండింటికీ నేనెప్పుడూ ముడి పెట్టను.

ప్రః భార్యభర్తలిద్దరిలో ఒకరే సినిమా కళాకారులైతే ఆ దాంపత్యం ఎల్లా వుంటుందంటారు?

జః ఏం అల్లాంటి వారూ వున్నారుగా.

పి. శంకరయ్య , ధర్మపురి.

ప్రః “శ్రీ కృష్ణవతారం”లో చిన్నకృష్ణుడుగా నటిస్తున్నచిరంజీవి హరికృష్ణ చదువుతున్నాడా ? సినిమా నటన నేర్చుకుంటున్నాడా ?

జః అబ్బో హరికృష్ణ ఉద్దండుడుః రెండూ చేస్తున్నాడు.

యస్. ఎ. కాదర్. శ్రీకాకుళం.

ప్రః అక్కయ్యా నా బరువు 32 కేజీలు….. మీ బరువు రావాలంటే……..?

జః బాబ్బాబు…. సగం బరువు నా దగ్గర్నుంచి తీసేసుకుందూ…..

తటవర్తి అనసూయ శరభరాజు , మార్తేరు.

ప్రః మీ మొదటి తెలుగు ,తమిళ చిత్రాలేమిటి ?

జః “సంసారం” (తెలుగు), “పాతాళభైరవి” (తమిళం).

ప్రః క్లాప్ ఉపయోగమేమిటి ?

జః సీను , షాటు గుర్తించడానికి అదొక్కటే మార్గం. చిత్రానికి, సింక్రనైజింగ్,ఎడిటింగ్‌కు క్లాప్ ముఖ్య గైడ్.

ప్రః ఒక షాటు తీయడానికి ఎంత టైం పడుతుంది ?

జః కనీసం అరగంటకు తక్కువ పట్టదు , ఆపైన ఎన్ని గంటలైనా కావచ్చు.

వై .వి .సత్యనారాయణ . ఏలూరు.

ప్రః మీరు. పి.ఎ పి, వారితో “నవరాత్రి” నిర్మించేటపుడు ముందు హీరోగా రామారావు గారిని బుక్ చేసి కారణాంతరాల వలన నాగేశ్వరరావుగారిని బుక్ చేశారట గదా ?

జః అబద్దం.

ప్రః మీరు “నవరాత్రి ” లో తీసివేసినా ,రామారావు గారు మీకు “ఉమ్మడి కుటుంబం”లో వేషం ఇచ్చి గౌరవించారు…దీన్నిబట్టి మీకు వారిపై అభిమానం లేకపోయినా, వారు మాత్రం గౌరవిస్తున్నారన్నమాటేగా ?
జః ఇక్కడ ఎవరికీ ఎవరిమీదా దురభిప్రాయాలవేవి ఉండవు. ఏవో నీలి వార్తలు విన్న మీలాంటి వారు తీరికగా కూర్చుని ఇలాంటి అపోహలు పోతూ ప్రచారాలు చేస్తూంటారు.

పాల్వాయి ముత్యాలు , గుంటూరు.

ప్రః ఈనాటి స్త్రీలు దిగజారిపోవడానికి కారణం సినిమాలంటాను.

జః అబ్బబ్బ…ఈ ప్రశ్నతో విసుగెత్తి చస్తున్నా… కాదూ.కాదూ అంటాను.

సి. మీనాక్షిగుప్త, ఏలూరు.

ప్రః పాపాయిలంటే నాకెంతో ఇష్టం.

జః ఔనూ నాకూ ఎంతో ఇష్టం .నేనంటే పాపలకి గూడా ఎంతో ఇష్టం.

షేక్‌గూడా మహమ్మద్ , సత్తెనపల్లి.

ప్రః మనసారా ప్రేమించిన అమ్మాయి విధివశాత్తూ ఒక ఆప్తుని అర్థాంగి ఆయింది. ఆ అమ్మాయి హఠాత్తుగా ఆ భగ్న ప్రేమికుని కలసినప్పుడు ఆ యిద్దరి మనస్సులో కలిగే భావాలు ఎల్లా వుంటాయండి?

జః “మనసే మందిరం” మరోసారి చూడండి.

ఎం. వి. భారతీ నారాయణ్ , అనకాపల్లి.

ప్రః నటి శిరోమణి “కంచుకోట” చిత్రంలో ప్రేక్షకుల సానుభూతైనా పొందలేక పోయారు.అది ఆ పాత్రలోపమా?

జః నా దురదృష్టం.

ప్రః నార్ల చిరంజీవిగారి భాగ్యనగరం చిత్రంగా నిర్మించండి మీరు.ఒక అమర ప్రణయ గాథ ఆంధ్రులకందిచిన వారౌతారు.

జః చూద్దాం.

ఢి. సునందా పాండురంగారావు. విశాఖపట్నం

ప్రః “ప్రాణమిత్రులు” ఔట్ డోరుకు మీరు మా విశాఖ వచ్చారుగదా ఇక్కడ ప్రదేశాలన్నీ చూచారుగదా , ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడికి రావలసిందేనంటారా న్యాయంగా?

జః కూడదని ఎవరన్నారు,అన్యాయంగా మాట్లాడుతారు మీరు.

యం . మునిరత్నం , కళ్యాణకట్ట , తిరుమల.

ప్రః ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో సెక్స్ ఎక్కువయింది ఎందువలన? అది ప్రజలపై ఎట్టి మార్పు తెస్తుంది?

జః ప్రజలకు కావలసిందేమోనని పరిశ్రమ, పరిశ్రమ చూపిస్తోందని ప్రజ. భేష్ ఇదీ తమాషా జరుగుతోంది. ఎల్లాంటి మార్పు తెస్తుందో కొంతకాలం ఆగితేగాని అర్థం కాదు.

శాంబాని జోఎఫ్ . పాలూరు.

ప్రః సినిమా తారల జీవితాలు పూల పానుపులా వుంటాయని, నిత్యం వారంతా ఆనందంతో హుషారుగా తిరుగుతారని…

జః మీరనుకుంటున్నారుగదూ ,పువ్వులుంటే ముళ్ళుంటాయి కూడా.

సూర్యదేవర సాంబశివరావు , చేబ్రోలు

ప్రః హైదరాబాద్ చిత్ర పరిశ్రమపై మీ అభిప్రాయం?

జః ఎంతో అభివృద్ధి చెందాల్సింది చాలా వుందక్కడ . అవకాశాలు కూడా వున్నాయి.

విజయ జయరాజు, ఏలూరు.

ప్రః మీ హాబీ ఎమిటి?

జః ప్రస్తుతం వంట.

ప్రః తాను ప్రేమించిన వారితో జీవించడానికి, తల్లిదండ్రులను ఆస్థిపాస్తులను , అభిమానాన్ని కూడా త్యాగం చేస్తారు . తకంటే తాను ప్రేమ త్యాగం గొప్పది. ఉన్నతమైనది కాదంటారా?

జః ఇది సందర్భాలను బట్టి నిర్ణయించవలసి వుంటుంది.

కె. రంగనాథ కుమార్ . శ్రీకాకుళం

ప్రః 1967 లో పద్మశ్రీ బిరుదు మీకు తప్పక వస్తుంది.

జః అంత బరువే కష్టం… నేనెప్పుడూ నటిగానే వుండాలనుకుంటున్నాను.

యస్ .ఎ. రహ్మాన్ , యల్లఁదు కాలరీస్.

ప్రః పునర్జన్మ వుందంటారా?

జః నా కదేం తెలియదు.

ప్రః కార్యసాధనకు తెలివి అవసరమా పట్టుదల ముఖ్యమా?

జః తెలివిలేని పట్టుదల మూర్ఖత్వం, పట్టుదల లేని తెలివి వృధా. రెండూ వుండాలి.

కె. జయకుసుమ , విద్యానగర్.

ప్రః మీరింక నటించడం మాని దర్శకురాలిగానే వుంటారా?

జః నటనా జీవితం వదలుకోవడం నా లక్ష్యం గాదు.

సువర్ణ సత్యనారాయణమూర్తి . గిద్దలూరు.

ప్రః ప్రతి వాళ్లూ ప్రేమ, ప్రేమ అని అంటారుగదా ఇదేమైనా రసాయనిక పదార్థమా?

జః ప్రేమలో చాలా రకాలున్నాయి. బెడిసినపుడు నిరసాయనికమేగా ఆ ప్రేమ.

ఎర్నేని రామారావు . స్యూర్యాపేట.

ప్రః మీరు కూడా హైదరాబాద్కు మకాం మార్చుతారా?

జః ఎల్లా ఇక్కడి చిత్రాలు, సంసారం..

పోలా మోహనరావు . వైరా.

ప్రః వివాహం ఘనత ఏమిటి?

జః జీనితంలో ముఖ్యమైన ఘట్టం మరి

ఆలపాటి రామకోటయ్య , పాలకొల్లు.

ప్రః ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రి వున్నారు కదా ,అదే రీతిగా చిత్రశాఖకు (సినిమాకు ) ఒక మంత్రిని ప్రత్యేకంగా నిర్ణయించేలా మీరంతా కృషి చేయకూడదా ?

జః ఇన్ఫర్మేషన్ ఆండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వశాఖకు చెందినదే ఈ రంగం కూడా.

ప్రః “కంచుకోట” చివరి సీనులో ధనరాసుల మధ్య చనిపోయినది మీరేనా?

జః అల్లా చచ్చిపోయినది నేనే బాబూ.

ఎన్, స్వర్ణకుమారి. పార్వతీపురం.

ప్రః ఆదర్శాలు , ఆశయాలు కలవక . ఇన్ఫీరియారిటీ ఫీలయ్యే స్నేహితురాలితో ఎలా మెలగాలి?

జః ఆదర్శాలు , ఆశయాలు కలవకపోయినా స్నేహానికి అవేమీ అడ్డు కాలేవు… ఇన్పీరియారిటీ దీనికింక అనవసరం.

డి. శారద , గుంటూరు.

ప్రః “దేవదాసు”లో పార్వతి , “మూగమనసులు”లో రాధ ఈ రెండింటిలొ మీకు బాగా నచ్చిన పాత్ర ఏది?

జః రెండూ బాగా నచ్చిన పాత్రలే. అవి రెండూ రెండు రకాల స్వభాలు కలవి.

పి. దేవరాజ్ . భిమవరం.

ప్రశ్నః 150 సినిమాల్లో అనేక బరువైన పాత్రలు పోషించి, మాచే కన్నీరు కార్పించిన మీరు జీవితంటే ఏమని గ్రహించారు?

జః మూడు పువ్వులూ ఆరు కాయలు కాదని.

ప్రః ప్రేమ పవిత్రమా పెళ్ళి పవిత్రమా ?

జః పెళ్ళి పవిత్రబంధం – ప్రేమ అనంత రాగ బంధం.

బిక్కాల గోవాలరావు కాకినాడ.

ప్రః మీ సినీ నటనా జీవితంలో మరువరాని సంఘటన ఏది?

జః ఎన్నో వున్నాయి. అయినా “మూగమనసులు” సంఘటన ఒకటి తలుచుకుంటే యిప్పటికీ ఒడలు జలదరిస్తూంటుంది . ఔట్ డోర్లో గోదావరి మధ్య బోటు మీద నుంచి కాలు జారి నీటిలో పడిపోయాను . నీళ్ళ క్రింద ఫాన్ తిరుగుతొంది, అంత ప్రమాదం జరిగినా , అదంతా నా నటనే అనుకుంటూ ఒడ్డునున్న వాళ్ళంతా ఆనందిస్తూ కూర్చుండి పోయారు . బ్రతికి బయటపడేపరికి చచ్చే చావయింది. ఈ సంఘటన తలుచుకుంటే . అబ్బో…….

కె. కుమారి, గస్తినవగాం.

ప్రః Why? Wife is a knife… it cuts our life…?

జః అదేమో గాని … మా వారు wife is light and life అంటారు మరి.

కె. బి . వై .గిరి , నిట్టల్వాడి.

ప్రః నాటకంలోను , సినిమాలోనూ నటించేటప్పుడు అనుభూతులు ఒకేలా వుంటాయా?

జః ఉండవు నాటకంలో ప్రత్యక్షం… సినిమాలలో పరోక్షం.

ఎ యాదగిరి మంచిర్యాల.

ప్రః మీ చిత్రాన్ని తైలవర్ణంలో చిత్రించాను. అనుమతిస్తే పంపిస్తా?

జ.థాంక్స్…పంపండి.

ప్ర. సినీ తారలతో మా ప్రశ్నలకు జవాబులిప్పించడంలో ఈ పత్రికా సంపాదకుల అభిప్రాయం?

జః మిమ్మల్ని మమ్మలి మరింత సన్నిహితుల్ని చేసి దగ్గరకు తీసుకుని రావాలని.

గుడిపాటి లక్ష్మ నరసింహారావు, ఆకివిడు.

ప్రః మీరు మొదట వెండితెరకు ఎవరి సహాయంతో ప్రవేశించారు?.

జః కాకినాడ కళాపరిశత్ సహాయంతో.

యస్ . రామారావు , ఆముదాలవలస.

ప్రః మీరేమి సాధించారు? మీకు తృప్తినిచ్చేదేది ?

జః పనికి రాను అన్న నాకు ఈ నాడు మీ అందరి అభిమానం ఇంతగా లభించింది . అంతకన్న సాధన , తృప్తి మరే ముంటాయి.

కె. అన్నపూర్ణ , పాలకొండ.

ప్రః ఏ వ్యక్తి తన స్వశక్తితో పైకి రాలేడు, అదృష్టం దానికి కలసిరావాలి . అవునంటావా అక్కయ్యా?

జః నా అనుభవం వేరు, స్వశక్తితో కృషిచేస్తే అదృష్టం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది.

ప్రః నిజ జీవితంలో నిత్యం మనం చేసే నటన , మీరు తెర పైచూపే నటన కన్నా గొప్పదంటే అంగీకరిస్తారా?

జః తప్పకుండా.

కానూరి రాజేందర్ , గుడివాడ

.

ప్రః కళ కోసం చిత్ర నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది?

జః వ్యాపారం అనుకోనప్పుడు.

పుష్పలత , మంగళగిరి,

ప్రఃమనదేశం నిరుద్యోగాన్ని , దారిద్రాన్ని నిర్మూలించే నూతన సమాజ నిర్మాణం ఎప్పుడు ఏర్పడుతుందంటారు?

జః సంఘీభావం , సమిష్టికృషి సాగినప్పుడు.. దానిని ఎప్పటి కైనా మనమే ఏర్పరుచుకోవాలి మరి.

కె. ఆప్పలరాజు . భీమవరం,

ప్రః నేటి సెన్సార్ పద్దతి పై మీ అభిప్రాయం ఏమిటి?

ప్రః హాలివుడ్లో ప్రొడ్యూసర్సు సెల్ఫ్ రెగ్యులేటింగ్ సెన్సార్ పెట్టుకున్నారని, దానివలన ఎంతో మేలు జరుగుతోందని అంటున్నారు. ఆ పద్ధతి నిజంగా వస్తే ఎఁతో మేలు జరుగుతుంది.

బి. రామారావు , కావలి

ప్రః విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని వద్దకు వచ్చి కార్యార్ధినైవచ్చానంటాడు . అది ఎట్టి దైనా సరే మీ కోరిక తీర్చడమే నాకు సంతోషం అంటాడారాజు. అటువంటప్పుడు నువ్వు అబద్ధమాడవలెను అదే నాకోరిక అని విశ్వామిత్రుడు అడిగివుంటే?

జః ఆ కథ అల్లా జరగదు. మీరీ రోజు ఈ ప్రశ్న పంపలేరు.

రెడ్డిరత్నం , తిరుపతి.

ప్రః జీవితం జీవితం అంటారు ఏం జీవితాలో ఏమో . మీ జీవితంలొ ఏం సుఖముందో చెప్పు అక్కయ్యా?

జః మన మనస్సుని బట్టే కష్టం సుఖం అనేవి వుంటూ వుంటాయి. ఇంక నా జీవితంలో అంటారా అంతా సుఖమే అనుకుంటాన్నాను.

కె. రామారావు , మచిలిపట్నం.

ప్రః మీరు గతించిన మీ జీవితం తలుచుకంటే ఏమనుకుంటారు?

జః నేను చాలా అదృష్టవంతురాలిని అనుకుంటా.

మానుకొండ మెరి ఫ్రెడరిక్, నర్సస్నపేట.

ప్రః కుటుంబ నియంత్రణ పై మీ అభిప్రాయం?

జః చాలా అవసరం .

యస్ . ఎస్. దర, కావలి.

ప్రః మీకు అతి ప్రియమైన వస్తువు కళ్లెదుటే జారిపోతుంటే చూస్తు ఊరుకొవటమేనా?

జః పట్టుకోగలుగుతే జారనివ్వకండి జారిందా , బేజారయి భవిష్యత్తు పాడుచేసుకోకండి.

డి .కమల ,వులిగడ్డ .

ప్రః ఒక పాత్ర పోషించాలంటే, ఆ పాత్ర స్వభావాన్ని అనుభవించి ప్రేక్షకులను తన్మయులను చేసేలా కృషి చేయాలిగదా, కాని అందరూ అలా న్యాయం చేకూర్చుతున్నారంటారా?

జః న్యాయం చేకూర్చాలనే ప్రతి ఒక్కరూ కృషి చేస్తారు . అలా చెయ్యకపోతే పాత్రకు అన్యాయం చేసుకున్నట్టే గదా.

బి. శ్రీనివాసరావు, ఆముదాలవలస.

ప్రః తీపిలో చేదుందంటారు, మరి మీరు చేదులో ఏముందంటారు?

జః తినగా తినగా గారెలు కసురెక్కుతాయి, నిజమే తినగ వేప తియ్యనౌతుంది కదా.

వీరేపల్లి వెంకటేశ్వర్లు , నిరపరావుపేట.

ప్రః కృషితో నాస్తి దుర్బిక్షమ్ అంటారు గదా ఎంత కృషి,చేసినా మన దేశంలో ఆహార సమస్య తీరకున్నది. ఎందుచేత?

జః కృషి నా స్తి కావడమే.

పి . నరసింహారావు, బుచ్చెంపేట.

ప్రః పెరుగుతున్న జనాభా, ధరలు , విదేశీమారక ఋణాలు , మరో వైపు పెరుగుతున్న అన్యాయాలు మోసాలు , అధర్మాలు మన దేశం పురొగమిస్తుందా, తిరోగమిస్తుందా ఎటు వెడుతొంది?

జః అసలు ఇప్పుడు ఎక్కడవుందో తెలియడం లేదు.

ఎం .పద్మావతి. విశాఖపట్నం.

ప్రః “ఉమ్మడి కుటుంబం”లో అంత శాంతంగా కనిపించారు , కొంపదీసి మీ ఇంట్లోకూడా అంత శాంతంగానూ వుంటారా?

జః అవసరాన్నిబట్టి.

బి. జి. కృష్ణ , మద్రాస్.

ప్రః మాతా ఫిలింస్ కథ ద్వివేదుల విశాలాక్షి గారి రచనలు గదా?

జః కాదు.

ఎన్ . ఈశ్వరుడు , రాజమండ్రి.

ప్రః ప్రముఖ తారగా పేరొందిన మీపై మీవారి అభిప్రాయం ఏమిటి?

జః ఆయన నాకొక ముఖ్యమైన ఫ్యాన్.

చంద్రగిరి లక్ష్మిరామలింగం , సూర్యాపేట.

ప్రః మానవునకు ఒక కోరిక తీరగానే మరో కోరిక తలెత్తుతూ వుంటుంది . మిమ్మల్నే చూడంది మీరు నటిగా అశేష ప్రజా ఆదరాభిమానాలు పొందారు . గృహిణిగా చక్కని సంసారం చేస్తున్నారు. ఇప్పుడు దర్శకురాలు కాబోతున్నారు . ఆపైన యింకేమి కోరుకుంటారు?

జః కోరిక తప్పుగాదు. కోరినదాన్ని కష్టించి సాధించడమే జీవితం . అయినా దర్శకత్వం నేను కోరుకుంటే వచ్చినది మాత్రం కాదు . నా కోరిక ఒక్కటే , మంచి నటినిగావాలనే కాని ఆ హద్దు లెక్కడున్నాయో . ఎప్పటికి చూడగలుగుతానో.

కె. పి. భాస్కర్ మొవ్వ.

ప్రః ఉదాత్తమైన పాత్రలు నటించి, ఉత్తమోత్తమ నటిగా ప్రేక్షకులనుండి అమితమైన అభిమానాన్ని పొందిన మీరు,అదే తెలుగు తెరపై ముద్దు ప్రవేశ పెడితే మీరు నటిస్తారా ? నటిస్తే ఎలావుంటుంది?

జః నటించను ఎలావున్నాసరే.

డి దుర్గ మంగళగిరి

ప్రః మీకు సంగీతం వచ్చు కదా , స్వంతంగా ఏ పాటా ఏ సినిమాలోనూ పాడరేం?

జః నాకంటే బాగా పాడే వాళ్ళుండడంచేత.

కొండూరు మొగిలయ్య, హుస్నాబాద్.

ప్రః మీరే చిత్రంలోనైనా మీకు బరువనిపించిన పాత్ర ధరించారా?

జః నేను నటించే పాత్రలన్నీ బరువైనవే .

మోహినుదీన్, గోపన్నపాలెం.

ప్రః స్త్రీల వివాహం పరిమితి 20 సంవత్సరములు పెట్టటంవలన కుంటుంబ నియంత్రణ కొంతవరకు పరిష్కారం కాగలదమో, మీ అభిప్రాయం ఏమిటి?

జః ఔవును బాధ్యతలు , సంసారం, అర్థం చేసుకునేందుకు కొంత వయస్సు కావాల్సేందే గదా.

జాజ వెంకట లలిత, విజయవాడ.

ప్రః అక్కయ్యా విజ్జి యిపుడేం చదువుతోంది?

జః చర్చ్ పార్క్ కాన్వెఁ ట్‌లొ నాల్గవతరగతి.

తమ్మన పద్మావతి , శ్రీకాకుళం.

ప్రః సృష్టిలో విచిత్రమైనదేది?

జః అసలు ఆ సృష్టే అతి విచిత్రం.

పి. విద్యావతి , గుంటూరు.

ప్రః మీ కుమారుని పేరేమి పోలికలు నాన్నవా, అమ్మవా?

జః మేం ముద్దుగా పిలుచుకునే పేరు సతీష్ . పొటో చూచి మీరే నిర్ణయించండి ఆ పోలికలు.

ఎ. రాధాకుమారి . అమలాపురం.

ప్రః అక్కా మీరెపుడైనా కథలు వ్రాశారా?

జః తెలుగులో “యువ” , అరవంలో “ఆనంద వికటన్” పత్రికల్లో నేను వ్రాసిన కథలు వెలువడ్డాయి.

ప్రః నేటి నవలా సాహిత్యం మీద మీ అభిప్రాయం?

జ.విషయం సున్నా-వివరణ వంద పేజీలు.

శకుంతలాబాయి, లక్షట్టిపేట.

ప్రః ఉపవాసాలు చేస్తే ఆత్మ పరిశుద్దమపుతుందంటారు కొందరు . ఉపవాసాలు చేసి ఆత్మను క్షోభించరాదంటారు కొందరు. మరి మీరేమంటారు?

జః మితం తప్పనిదేదీ హాని కాదు.

ఎం. దుర్గ, తెనాలి.

ప్రః జీవితంలో వెల లేనిదేది?

జః ఎంత డబ్బు ఖర్చుపెట్టి కొనబోయినా లభ్యం కాని అనురాగం.

కె. వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం.

ప్రః వైవాహిక జీవితంలో కళాసేవ చేయడం అసంభవం. కనకే తాను వివాహం చేసుకోదలచుకోలేదని ఇటీవల ఒక ప్రముఖ తెలుగు నటి సెలవిచ్చింది…..మీ అభిప్రాయం ,అనుభవం చెప్పగోర్తాను.

జః వ్యక్తిగత సమస్య వివాహ విషయం . అనుకూలతనుబట్టి ఎవరి అభిప్రాయాలు వారివి.

ప్రః ధనము అస్థిరమని తెలిసికూడా మానవుడు ధనమే ప్రధానమని, సమాజమును కలుషితం చేయుచున్నాడు…ఏ మాయను జయించ లేక ?

జ.మమ అనుకునే నేను,నాది అనే స్వార్ధాన్ని జయించలేక.

ఎం . సీత , వంపాడు.

ప్రః మీదేవూరు? మీ నాన్నగారి పేరు? సన్నగా వున్నప్పుడే చాలా అందంగా వుండేవారు మీరు అని నేనంటే కోపం రాదుగదా?

జః నా జీవిత విశేషాలు పత్రికల్లో చాలాసార్లు వచ్చింది. పుస్తకమే వచ్చింది. ఇంకా ఇవేనా ప్రశ్నలు. మీకు తోచినది చెప్పినపుడు నాకెందుకు కోపం వస్తుంది.

పి. కామక్షి బాస్కర్ అత్తిలి.

ప్రః “ప్రాణ మిత్రులు” సినిమాలో మీరు చిన్నాని తిరస్కరించి బాబు గదిలోకి ప్రవేశించిన సన్నివేశానికి నా గుండె ఆగిపోయినంత పనయింది. ఆ దృశ్యంలో నటించేటప్పుడు మీకెల్లా వుంది?

జః ప్రతి సన్నివేశంలోనూ నటించి రాణించాలనే తాపత్రయం,ఆవేశం నాకు అలవాటేగా.

కొమరవల్లి ప్రభాకర్, కరీంనగర్.

ప్రః ఫిలిం పరిశ్రమను జాతీయం చేయాలనే విధానంము మీరు సమర్థిస్తారా?

జః జాతీయం చేసి ఫలితాలు చూడాలి మరి…..

బుడుమూరు కొండమ్మ , శ్రీకాకుళం.

ప్రః నేటి మన క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితికి పరిష్కారం వుందా?

జః ఉంది జనాబా పెరగకుండా జాగ్రత్త పడటం.

మేడిశెట్టి వీర వెంకటసత్య నారాయణ, పెద్దాపురం.

ప్రః అక్కయ్యా స్త్రీ ఎల్లా ఉండాలో పెద్దలు చెప్పారు. కార్యేషుదాసి, కరమేషుమంతి… అంటూ… మరి పురుషు లక్షణం ఏమిటంటారో?

జః ఉద్యోగం పురుష లక్షణం అన్నారుగా.

ఎం . లీలావతి, జగ్గయ్యపేట.

ప్రః అక్కయ్యా మద్రాస్ నివాసివయ్యావ్, తమిళ నటుని వివాహమాడావ్ … మీ విజయ , సతీష్ లను యే రాష్ట్రాలకు పంపించదలిచావ్?

జః అబ్బో ఆ అలొచనకు యింకా చాల కాలం వుందిలే చెల్లాయ్, తొందర దేనికి.

ఎ. ప్రకాశ్, హుజూరాబాద్.

ప్రః సినీతారలకు విహహం అవసరం లేదనుకొంటా?

జః ఏం ఎందుకని?

ప్రః వివాహితులైన సినీతారలు చిత్రాల్లో నటించేటప్పుడు వారి మంగళసూత్రాలు కనబడ వేమండి?

జః మీ చూపు అటెందుకు వెళ్తుంది?

కందగట్ల మల్లేశం. వరంగల్లు.

ప్రః మాతా ప్రొడక్షన్స్ నిర్మించబోతున్న చిత్రం వివరాలు తెలియజేస్తారా?

జః అతి త్వరలోనే మీకు తెలియగలుగుతాయిలెండి.

కె . యస్ . మణ్యం ,పాలకొల్లు.

ప్రః మీ పూర్తి పేరేమిటి?

జః బాగుంది ప్రశ్న సా – వి – త్రి – సరేనా.

యు. డి .ఎల్. రాజు లొల్ల.

ప్రః ముగ్గరు పిల్లలు తర్వాత పిల్లలు కలుగకుండా ఆపరేషన్ చేయించుకుంటే ఖరీదైన ట్రాన్సిష్టర్ రేడియో ఇవ్వబోతున్నట్లు ఆరోగ్యశాఖా మంత్రి అన్నారు . ఆ రేడియోలకు ఖర్చు పెట్టే డబ్బుతో పుట్టిన పిల్లల్నే పోషించచవచ్చు గదా?

జః మీరు పుట్టిన బిడ్డల్ని 3.0 రూపాయలతో పెంచి పెద్దవాళ్లను చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమని పిలవాలొ , ఎల్లా అర్థం చేసుకోవాలో నాకు తెలియడంలేదు.

యు. విజయకుమార్, ముక్తేశ్వరం.

ప్రః మనదేశం అరబ్ రాజ్యాలను కౌగిలించుకుంటూ ఇజ్రాయెల్ తో విరోధం కల్పించు కోవడం…. ?

జః ఆగండి బాబ్బాబు .. ..ఆ భారతం విప్పితే ముగియడం కష్టం. కావాలంటే చిత్రాలు , చిత్రపరిశ్రమ గురించి అడగండి.

కె. నాసుదేవ , మిర్యాలగూడ.

ప్రః పాశ్చాత్యులు స్త్రీ కి ఇచ్చే విలువకు మనం ఇచ్చే విలువకు తేడా ఏమిటండీ?

జః ఇతర దేశాల్లో స్త్రీ పురుష భేదాలు లేనేలేవు. మనదేశంలో ఒక ప్రత్యేకమైన , ఉన్నతమైన పవిత్ర స్థానం స్త్రీకి అనాదిగా వస్తూ వుంది .

డి, కరుణ శి. కావలి,

ప్రః మానవ జన్మకు అర్థం ఏమిటి ?

జః మనిషిగా పుట్టి , మనిషిగా బ్రతుకుతూ, మనిషిగా అందరినీ గౌరవించి మానవత్వం కలిగి మరణింమచడమే మానవజన్మ పరమావధి.

పి అంజనేయమూర్తి, కొత్తపేట.

ప్రః మీరు హైదరాబాద్ మకాం రాలేదేమండీ?

అడబాల మార్కండేయులు, నరపాపురం.

ప్రః దేవుడు సృష్టించిన మానవుని కంటే మానవుడు సృష్టించుకున్న రూపాయి నోటు కు విలువ హెచ్చు. మరి ఈ మానవుని విలువ ఏమయిందంటారు?

జః ఆ రూపాయి నోటు వెనక దాక్కుంది.

డి వెంకటేశ్వరరావు, ఆవనిగడ్డ.

ప్రః పూల దండలో దారం దాగుందని తెలుసు , మరి పాల గుండెలో ఏది దాగుందో చెప్పండి?

జః కాలం గడుస్తుంటే కర్కశత్వాన్ని పొందాలని తెలియని పసిడి హృదయం.

వై . పార్వతీ చిరంజీవిరావు . కాకినాడ.

ప్రః కళ్లుండి కూడా ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే మనిషి ఎటువంటివాడు?

జః కళ్లున్న కబోదు.

కాండ్రేగుల వెంకటనూకేశ్వరరావు అనకానల్లి

ప్రః కళాశాలల్లో సెక్స్కు సంభంధించిన పాఠ్యభాగం ప్రవేశ పెట్టాలంటున్నారు. మీ అభిప్రాయం?

జః ఆరోగ్యసూచన అది , జనాభా పెరుగుదల కొంత తగ్గవచ్చు.

జి. హరి హైద్రాబాద్.

ప్రః సినీతారలు ప్రతిసినీ హీరో వెంట నటించేది కాసుకోసమా కళ కోసమా?

జః నిజం చెప్పనా? రెండింటి కోసమూనూ.

కొలకలూరి భారతి, నర్సీపట్నం.

ప్రః మనసులు విరిగి మనుష్యులు దూరమైయ్యాక, మమతలు చిగురిస్తే ప్రయోజనం?

జః మనలో మమత చెరగనిది. తాత్కాలికంగా ఉద్రేకంలో దూరమైనంత మాత్రాన మనసు విరగదు.. విరిగితే అతకదు.

ప్రః ఈ విశ్వంలో స్త్రీ పురుషులలో ఎవరిపాత్ర విశిష్టమైనది? ఏ పాత్రకు బరువు బాధ్యతలు అధికం?

జః ఈ కాలంలో యిద్దరూ సమానమే అన్నిటిలోనూ.

సూరెడ్డి బాబురావు తిరుపతి.

ప్రః కూతురు కొత్తగా అత్తవారింటికి వెళ్లేటప్పుడు కన్నీటి అర్థమేమిటి?

జః అంతవరకు పుట్టింటి గారాబంతో పెరిగిన ఆ కూతురు అత్తింటికి వెళ్తూంటే ఆమె నూతన జీవితానికి ఆ తల్లి తన కన్నీటితో కడిగి నిర్మల మొనర్చడమే ననుకుంటా.

చల్లపల్లి నాగేంద్రన్ బందరు.

ప్రః నేనూ,నా స్నేహితుడూ బందరు లడ్డూ తీసుకుని, మీ ఇంటికి వద్దామనుకుంటున్నాము. ఏమంటారు అక్కయ్యా?

జః వెరీగుడ్ బ్రదర్ , మా అమ్మాయికి లడ్డూలంటే బలే ఇష్టం.

బి కృష్టారావు నల్లగొండ.

ప్రః 150 చిత్రాల్లో నటించిన నటిగా , నిర్దేశకురాలిగా ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం మేమిటి?

జః ఆదర్శవంతమైన చిత్రాలను ప్రోత్సహించమని, మన సంప్రదాయానికి విరుద్దమైన వాటికై ఉత్సాహపడవద్దని, యువ ప్రేక్షకులకు నా అభ్యర్థన.

ప్రః ప్రజాస్వామ్య ప్రభుత్వంలో చలనచిత్రసీమ అభివృద్ధిపై మీ అభిప్రాయం?

జః సినిమా గొప్ప ఎడ్యుకేటివ్ మీడియా అనేది అన్నిదేశాలూ అంగీకరించిన సత్యం అందుకే దాని అభివృద్ధి ప్రతి దేశానికి ముఖ్యమే.

ప్రః వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా మీరు నిలబడకూడదా?

జః మీ అభిమానానికి Thanks.కాని మీరు నిలబడకూడదా.

ఎ, వీరబ్రహ్మచారి , మిర్యాలగూడెం

ప్రః స్త్రీ గాని , పురుషుడు గాని ఒక్కొక్క సమయంలో నైతికంగా పతన మొందటానికి కారణ మేమిటంటారు?

జః నైతిక పతనానికి కారణం వారివారి మనో దౌర్బల్యం.

యన్ , వి .వి సత్యనారాయణమూర్తి కొత్తపేట

ప్రః జాతీయ సమ్తెక్యతకు వర్ణాంతర వివాహాలు దోహదమవుతాయా?

జః జాతీయ సమైక్య సాధన కిదొక మార్గమే.

ప్రః హిందూ సంస్కృతిలో సంగీత సాహిత్యాల స్థానమేది?

జః మన సంస్కృతిలో సమ్మిళతమై వున్నవే ఈ రెండూ.

యం, వి మబ్బారావు , కొత్తగూడెం కాలరీస్.

ప్రః వర్ణాంతర వివాహం గురించి మీ అభిప్రాయం ?

జః నన్నా అడుగుతున్నారు ఆ ప్రశ్న…భేష్ .

గంటి నరసింహారావు పార్వతీపురం.

ప్రః అక్కయ్యా సుఖ జీవితం కోసం అందాల యువతి అవసరమా అనురాగవతి అవసరమా?

జ.అనుకూలవతి చాలా అవసరం.

ప్రః గరల్ ఫ్రండ్ కి లవర్ కి, ఏమీ తేడా లేదని నా స్నేహితుడు, ఉందని నేనూ….

జః మీరే కరెక్ట్.

వి. యస్ మాధవి , తిరిపతి.

ప్రః ఈ మధ్య మీరు మరీ లావై మీ పాత్రను సరిగా పోషించుకోలేకుండా వున్నారు. మీ సైజుని తగ్గించుకొనుటకు ప్రయత్నమేమి చేయలేదా?

జః మీతో ఏకీభవించలేకపోతున్నాను. నేను నా శరీరాన్ని పోషించలేక పోతున్నానే మోగాని నేను నటించే పాత్రను పోషించలేనిదెపుడు.

శ్రీ ధర్వ సంరక్షిణి తిరుపతి .

ప్రః శీలమతుల స్త్రీలు అనగా ఎవ్వరు?

జః శీలవతులు.

ప్రః వారి లక్షణములేవి?

జః శీలము కలిగి వుండుట.

ప్రః అట్టి మహాగుణవంతులైన మహిళలు ప్రస్తుత భారత దేశంలో మీకు తెలిసిన వారెవరు?

జః మన ప్రధాని ఇందిరా గాంధి మీ నటి సావిత్రీ గణేశన్ ఇంకా ఎంతో మంది.

వి. నరసింహరెడ్డి విడమర్రు.

ప్రః ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాలపై మీ అభిప్రాయం ఏమిటి?

జః మార్పు లేవీలేవు … కాస్త సెక్స్, క్రైమ్ కొత్త చేర్పులయ్యాయి … అంతే.

కొండ గంగన్న , రాళ్ళగుడిబండ.

మమ అనుకునే నేను , నాది అనే స్వార్థాన్ని జయించలేక……….

ప్రః నాగార్జునసాగర్ డ్యాము త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని సాయం కోరితే,
ఎకరాకు రెండు వందలు వసూలు చేసుకుని నిర్మాణం పూర్తిచేయమని మొరార్జీ సెలవిచ్చారు . ఆ తెలివి మన ప్రభుత్వానికి లేదనా?

జః ఇది ప్రజాస్వామికయుగం ప్రజాప్రభుత్వం ఏది చేసినా ,ఎలా చేసినా మనకోసం చేసుకొవడమేగా.

ఇ టి రామారావు , కావలి.

ప్రః సినిమాలలో చేరాలని కుతూహలపడుతున్న స్త్రీలకు మీ సలహా?

జః కుతూహలం ఒకటే చాలదు . ఇక్కడి సాధకబాధకాలు పూర్తిగా గ్రహించిన తర్వాత ఆ ఉత్సాహం ఎంతవరకూ వుంటుందో చూడండి. ఆ తర్వత యోగ్యత , నటనా ప్రావీణ్యత వగైరాలన్నీ లెక్కకు వస్తాయి.

ప్రః నేడు చాలమంది స్టూడెంట్సికు సినిమా తారలపై మోజు కలగడానికి కారణం ఏమిటి?

జః అది మోజు అంటే నేను అంగీకరించలేను. అభిమానం, ఆదరణ ఆత్మీయత అటువంటిది.

ప్రః శ్రీ మాతా పిక్చర్స్ స్థాపించడంలో మీ ఆశయం ఏమిటి?

జః అన్ని రంగాల్లో లాగే అన్ని పరిశ్రమలల్లో లాగే,ఈ పరిశ్రమలో కూడా స్త్రీలు ముందంజ వేయడం ముఖ్యమనిపించింది.
సినిమా నటనలో జీవితాన్ని గడిపి రిటైరైపోయే స్త్రీలను ముఖ్యంగా ఈ సంస్థ ద్వారా ఆదరించాలని నా ఆశ.

పి . జె.పి. నారాయణ . శ్రీకాకుళం.

ప్రః ఆహార కొరత తీర్చాలంటే?

జః ఒకరి సంపాదన , పదిమంది తినడం అనే అలవాటు పోయి ప్రతి ఒక్కరు పాటుపడి సాపాటు చేయుడం ముఖ్యం.

స్వరాజ్య ప్రభావతి, పటమట.

ప్రః మీ బాబు పేరేమిట?

జః అబ్బో అది పెద్ద పేరు… శ్రీరామ్ నారాయణ సతీష్ కుమార్ . ముద్దగా పిలిచేది సతీష్ అని….

ప్రః పొదువు గురించి మీ అభిప్రాయం?

జః ఈ రోజుల్లో అది మంచిదే, కాని ఎల్లా ? అదే సమస్య.

తాళ్ళపాక సుబ్రహ్మణ్యం, కాళహస్తి.

ప్రః అత్తా , కోడలు ఆర్భాటాలు , ఆగడాలు , అఘాయిత్యాలు లేకుండా అనుకూలంగా వుండాలంటే ఏం చేయాలి?

జః మీరు పెళ్ళి మానేసి బ్రహ్మచారిగా మిగిలిపొండి.

సత్తి అమ్మి రెడ్డి మహేంద్రవాడ.

ప్రః మీకు గల ముఖమైన ఆశయమేమిటి?

జః మా అమ్మకు మంచి కూతురుగా, మా వారికి మంచి భార్యగా, మా పిల్లలకు మంచి తల్లిగా మీ అందరికీ మంచి నటిగా ఎల్లప్పుడూ వుండాలని…

జాలిసర్తి సుధాకర్ . మచిలీపట్టణం.

ప్రః మీరు నటించిన మొదటిచిత్రం ఏది? మీరు తీస్తున్న చిత్రానికి పేరు పెట్టారా? మీరింత వరకు ఏదైనా విదేశాలకు వెళ్ళారా?

జః నా మొదటిచిత్రం సంసారం. మా చిత్రానికింకా పేరు పెట్టలేదు . సిలోన్ . ఇండొనేషియా , మలేసియా , మొదలైన దేశాలు చూచివచ్చాను.

కె. కాళీపెట్టి . అనపర్తి.

ప్రః కాదల్ మన్నన్ మీభర్త అయ్యారు గదూ, మరి మీరో?

జః కాదల్ మన్ని(ఒదిన) అయ్యాను , మా వారి ఫాన్పు నన్నలానే పిలుస్తుంటారు.

సి.హేచ్ . పద్మావతి , ఏలూరు

ప్రః ఎంత చదివినా స్త్రీకి వంటఇంట్లోనే అంటారు … మీ అభిప్రాయం?

జః వంట ఇంట్లోనే మంచిది , హోటల్లో ఆరోగ్యం కాదు.

సి హెచ్ . సామహాలక్ష్మ . ఆడవికొలను.

ప్రః నేను లావు తగ్గటానికి ఏమిచేసునా ప్రయోజనం లేకపోతోంది. ఉపాయం చెబుతారని అశిస్తున్నాను.

జః సారీ రాంగ్ నంబర్.

రాంమోహన్ కుమార్ . రేపల్లె.

ప్రః విద్యాభివృద్దికి మీరు చేస్తున్న కృషికి ప్రత్యక్ష నిదర్శనమే, సావిత్రిగణేశ్ మాధ్యమిక పాఠశాల, వడ్డివారిపాలెం….. ఇంకా విద్యాభివృద్ధికి ఏమి కృషి చేస్తున్నారు? జః వేంకటేశ్వర యూవివర్సిటీలో సెనేట్ సభ్యురాల్ని… కస్తూర్బా నిలయానికి పాట్రన్ను, శ్రీనివాసగాంధీ నిలయానికి జీవిత సభ్యురాలిని….ఏదో చేతనైనంత వీలైనంత…

తమ్మినేని రామయ్య చౌదరి , హైదరాబాద్.

ప్రః జ్యోతిష్యం, భగవంతుడు , పూర్వజన్మ వీటి పై మీకు నమ్మకముందా?

జః జ్యోతిష్యం, పూర్వజన్మ నాకు తెలియని విషయాలు , తెలియని వాటిని నమ్మను నేను .మనకు తెలియని మహత్తర శక్తి ఏదోవుందని. మనకు ఆ శక్తి పై నమ్మకం కన్నా భక్తి ఎక్కువగా వుంది.

సి . అర్ . జోగేశ్వరరావు , న్యూఢీల్లీ.

ప్రః ఒకే విధంగా పెంచబడిన పిల్లలు యిద్దరూ, ఒకరు మంచివారైతే మరొకరు రౌడిగా తయారౌతుండవచ్చు . ఎందుకని యీ వ్యత్యాసం?

జః అది వాతావరణం , మనస్తత్వం, తిరిగే స్నేహితులు కారణంగా కావచ్చు.

ప్రః కుక్కకాటుకి చెప్పుదెబ్బ అన్నారు , ప్రతీకారం తీసుకోమని దీని అర్థంగదా?
అపకారికి ఉపకారం అన్నారు , పగవాణ్ణిగూడా ప్రేమించమనిగదా దీని అర్థం ఇలా రెండు రకాల సామోతలకు కారణం?

జః సందర్బాన్ని బట్టి సామెతలు వచ్చాయి. తొందరపడి ఉపయోగించినా ప్రమాదమే.

వి, కోటేశ్వరరావు , మచిలీపట్నం.

ప్రః సినిమాల్లో మద్దులు ప్రవేకపెడతారట మీ అభిప్రాయం?

జః మన సంస్కారానికి , సంప్రదాయానికి తగినది కాదని సూచన.

డి.ఆర్. స్వామి పి, సత్తెయ్య…. మంచిర్యాల.

ప్రః నా అభిమాన తార శ్రీమతి సావిత్రి అని చెప్పుకొనుటంలో నేనెంతో గర్విస్తాను. మరి ఈ మాట విన్నప్పుడు మీరెంతవరకు గర్విస్తారు?

జః మీలాంటి అభిమానులుని చూస్తే నేను పదింతలు గర్విస్తా.

ని. ముత్తేందర్ , ఓరుగల్లు.

ప్రః అనుబంధం అనేది చిత్రంగా వుంటుంది. ఒకరి గాధ హృదయాన్ని కదిలిస్తే , అంతకంటె నికృష్టమైన గాథ వినినా ఏమీ కలగదు ఒకొక్కసారి . ఎందు చేత నంటారు?

జః మన మూడ్స్ ముఖ్యం దానికి.

తుమ్మల జయాని నెహ్రూ, గుంటూరు. 1

ప్రః మన నటీమణులచే పాశ్చాత్య దుస్తులు ధరింపచేయుట మన మహిళలను కించపరచడంకాదా?

జః అట్లాంటివి చూడడం కూడా కించ పరచడమేగా?

బొజ్జా లక్ష్మమ్మ , పెన్పహాడ్.

ప్రః నేటికీ భార్యను బానిసలా వేధించుకుతినే భర్తలనేమనాలి?

జః నిజమా, అయ్తే ఏమనాలి చెప్మా?

Back

Leave a Reply