ఒకప్పుడు సావిత్రిగారు నామీద పనిచేసినమాట వాస్తమే. అది ఎంతవరకూ అంటే…. ఆవిడలాగే నడిచేదానిని, ఆవిడలాగే నవ్వేదానిని. అంతెందుకు—ఆవిడ ప్రతి కదలికా నాలో ప్రతిబింబించేది. ఒకానొక సందర్బంలో తమిళ్లో సావిత్రిగారు వేసిన ‘మరుపురాని కథ’ ను తెలుగులో నేను వేయాల్సి వచ్చింది. అప్పుడు సావిత్రిగారు ఒక మాటన్నారు. ‘నువ్వు నీలా నటించు నాలా నటించకు’ అని అప్పుడు నాలో పట్టుదల పెరిగింది.
సావిత్రిలాంటి మహాశక్తిని నాలోంచి ఎలాబయటికి పంపేది – ఒకటే ఆలోచనలు అదే సమయంలో
కన్నడ చిత్రాల్లో వేస్తున్న ‘కల్పన’ లోని అభినయాన్నీ…. హిందీలో షర్మలాఠాగోర్ యొక్క ఆడతనాన్నీ… స్టయిలునీ మిక్స్ చేసి…. కలుపుకుని ఆలోచించి సావిత్రిని బయటికి పంపించేసి “ఐ విల్ బికమ్ ఎ వాణిశ్రీ” అనుకున్నాను.
అయినా సావిత్రిగారంటే నా గాడెస్. సావిత్రి గారి ఏకలవ్యశిష్యురాల్ని. షీ ఈజ్ మై లైఫ్ నన్ను నేను
సావిత్రిగారికి-అంకితం చేసుకున్నాను.
ఎన్ని పద్మశ్రీలు, ఎన్ని భారతరత్నలు-యింకెన్ని అవార్డులు కలగలిపితే సావిత్రి అవుతుంది!
సావిత్రిగారి నటనను ఎంత వదిలించుకుందామన్నా రీ- ఎంట్రీ తర్వాత వచ్చిన ‘పూలరంగడు’ లో నన్ను
ఆవహించేసింది – మీరు గమనించారో లేదో.


Thanks to publish this type of Interviews
VERY INTERESTING