1954  జూలై  ‘ కినిమా పత్రికలో  కొమ్మారెడ్డి  సావిత్రి,

  పాఠకుల ప్రశ్నలకు   ఇచ్చిన  సమాధానాలు

నేనిప్పుడు  నటిస్తున్న  చిత్రాలుః
జనాతావారి  "పరివర్తన”; జంపన &  నందివారి  “మేనరికం”  (తెలుగు)  “కుడుంబం”  (అరవం) జెమినీ  వారి “ బహుత్ దిన్  హుయే”  (హిందీ);  విజయవారి  ‘మిస్సమ్మ’ (తెలుగు), “మిస్సియమ్మ”  (తమిళం);మోడరన్  థియేటర్స్  వారి  66 వ చిత్రం (తమిళం);  వినోదా  “కన్యాశుల్కం”, ఏ వి ఎమ్  వారి  “వదినె” (తెలుగు), “ చెళ్లపిళ్లై ”  (తమిళం).

ఎస్. బి. ఎన్ ప్రసాదరావు , బి. స్. సి. క్లాస్, కాకినా

ప్రః కొందరు  ప్రముఖ హిందీ తారలు ప్రకటించుకున్నట్లు  మీకు  కాబోయే భర్త ఎలాంటివాడుగా  వుండాలో చెప్తారా?
జః నేనింతవరకూ  ఊహించుకోలేదే.........
ప్రః దయచేసి  మీరు  త్వరగా  ఒక  ప్రొడ్యూసర్ అయి, మాలాంటి  ఉత్సాహవంతులైన కళాభిమానులకు  సినిమా  రంగంలో  తగిన  ప్రోత్సాహం కలిగిస్తారనాశించవచ్చునా ?
జః ప్రొడ్యూసర్  కాదలచుకోలేదు.
ప్రః ఇంతవరకు  మీరు  నటించిన  చిత్రాలలో  ఏ  పాత్రకైనా న్యాయము చేకూర్చానని  చెప్పగలరా?
జః చెప్పగలను.
                                                జి. బి  మన్న  పి.ఎన్. కె. పెదనింద్రం

ప్రః నేను  మీకొక  రిస్టువాచ్  బహుమతి  ఇవ్వాలనుకొనుచున్నాను. అది  మీకు  చేరేవిధం ఏలాగు?
జః పోస్టు విధంగా.
                       పొక్కునూరి  మల్లికార్జునరావు,  విజయవాడ -2          297
ప్రః జనతావారి  “పరివర్తన”  కథ,  ఆత్రేయ --- పరివర్తన నాటకం ఒకటేనా?
జః కాదు, దానికీ,  దీనికి  చాలా  తేడా  వుంటుంది.
ప్రః  “పరివర్తన”  లో హీరో ఎన్.టి  రామారావా  లేక  నాగేశ్వరరావా?
జః రామారావు
ప్రః మీరు  సినిమా  రంగం  చేరింది  కేవలం ధనాపేక్ష కోసమా  లేక కళోపాసనకా?
జః రెండింటి  కోసం
                                                    నీలాపురం  సాదక్  హుస్సేన్ , కడప
ప్రః “పెంపుడు కొడుకు”  డైరెక్టరు  అయన ప్రసాద్  గారిదని  నేను , కాదని  నా  మిత్రుడు వాదించుకుంటున్నాము. మీరు ఎవరితో  ఏకీభవిస్తారు?
జః “పెంపుడు  కొడుకు”  చిత్రం ప్రసాద్  గారిది  కాదు  ఆయన  ఆ చిత్రానికి  దర్శకుడు  మాత్రమే.
ప్రః కె.వి చౌదరికిని , కె. వి  రెడ్డికిని  ఏమైనా  సంబంధము  ఉందా?
జః  సినిమాల  వరకు  వారు  స్నేహితులు.
                                      దాసరి  యాకోబు, కలవచర్ల, తూ. గో. జిల్లా

ప్రః మీరు ఏ సినిమాలోనైనా  స్వంతముగా  పాటలు  పాడారా?
జః లేదు.
ప్రః బ్రతుకు తెరువు  లో మీకు  ఉన్న తలవెంట్రుకలు  మీ  తలవేనా  లేక  కంపెనీ  తలా?
జః ఇంకా నయం  మీ ముఖమేనా, లేక కంపేనీ  ముఖమా  అని  అడిగారు  కాదు.
ప్రః నేను  కినిమా కు  15  నెలలనుండి  ప్రశ్నలు  పంపుతున్నాను. కాని, నన్ను  నిరుత్సాహపరచి ఎవ్వరూ  కూడా  సమాధానాలివ్వడం  లేదు.  దయయుంచి  దీనికైనా  సమాధానాలిస్తారా?
జః 15 నెలలనుండి  సినిమా  కు  పంపిన  ప్రశ్నలు ఇలాంటివేనా  సోదరా?
                          ఎల్ .కె. వెంకటరమణ , భీముడువీధి , నౌపడా  302
ప్రః మీ అక్క  మారుతి , మీ నాన్నగరి  మొదటి  భార్య కుమారై  అని నేను , కాదని  నామనస్సు వాదించుకుంటున్నాము. ఏది  నిజము?
జః మీ   మనస్సు   చెప్పేదే నిజం.
                                        వసంతవాడ  భరతమ్మ, గుడివాడ
ప్రః సోదరీ నీ యొక్క  వివాహమునకు  నేను  రావచ్చునా?
జః తప్పకుండా....
ప్రః నాకు  కబురు పంపెదవా?
జః జ్ఞాపకముంటే...
                                        హెచ్. శ్రీనివాసరావు , రామచంద్రపురం

ప్రః మీరేదో  హిందీ  చిత్రాలలో  నటిస్తున్నారని  విన్నాను.  నిజమేనా  సోదరీ?
జః నిజమే.
ప్రః నిజమే  అయితే  మీకు  హిందీవచ్చా?
జః ఓ.
ప్రః పార్వతి  పాత్రవల్ల  మీరు తెలుసుకున్న  విషయాలేమైనా  ఉన్నవా?
జః అటువంటి  పాత్రలు  నటించటమంటే  పెద్ద  పరీక్షలకు  కూర్చున్నంత  పని  ఔతుందని...
ప్ర. “దేవదాసు”  లో  పార్వతి  చనిపోయిందీ  లేనదీ  కచ్చితంగా  తెలుపలేదు.  అసలింతకూ  పార్వతి  చనిపోయిందా  లేదా?
జః “దేవదాసు”  చనిపోయిన  తరువాత  పార్వతి  వున్నా ఒకటే  లేకపోయినా  ఒకటే.
                                         పడ్డాది  పాపారావు , మచలీపట్టణము 
ప్రః పాఠకులు  పంపిన  సమాధానాలు  ఇస్తారా  లేక  సంపాదకులకు  కూడా  ఏమైనా  బాధ్యత వుంటుందా?
జః ఈ జవాబు  నేనే  ఇస్తున్నాను.
                                                        పి. కృష్ణజీరావు, ఏలూరు
ప్రః మీరు యికమీదట  “విజయ”వారి  చిత్రాలలో  నటిస్తారండి?
జః ఏమండీ  అంత  సందేహం  కలిగింది!
ప్రః మీరు , భానుమతి  ఇద్దరు  కలిసి  నటించిన  చిత్రం  ఏదైనా  వున్నదా  అండి?

జః ఇంతకుముందెప్పుడూ  నటించలేదు. ఇకముందు నటించనున్నాము. ( “మిస్సమ్మ”లో)
ప్రః విజయవారి  “చంద్రహారం”  లో వలపుపాట  వినగానె  అన్న పాట మీదేన అండి?
జః కాదు... కోమల పాడింది.
                                                 పసుపులేటి  పద్మ , వావిలవలస
ప్రః “పెళ్ళిచేసిచూడు”  లో  జోలపాట  జి. వరలక్ష్మి , మీరూ  కలిసిపాడేరా  లేక  ఎవరైనా  పాడేరా?
జః జి. వరలక్ష్మిగారూ, సరస్వతీ  దేవిగారూ  పాడారు.
ప్రః మీరూ  కృష్ణకుమారీ  కలిసి  ఎందులోనన్నా  నటించారా?
జః ఆ.... నటించాం (“ప్రియురాలు”)
                                    ఎమ్. ఎన్. ఆర్. గోపాల్, గద్వాల్
ప్రః మన చిత్రనిర్మాతలలో  అనేకులు  తమ  స్వార్థము  కొరకు  పనిచేస్తున్నారని కొందరి   అభిప్రాయం  కొంత  వరకూ ప్రజాహితము  కొరకే  పనిచేస్తున్నారని  నా అభిప్రాయం  దానికి  మీ  సమాధానం?
జః రెండిటికీ  పనిచేస్తున్నారు.
                                    డి.ఎమ్. ధర్ , రాజమండ్రి
ప్రః మీకు  నేను వెనుక ఒక ఉత్తరము  వ్రాయగా , దానికి జాబు వ్రాయకపోవుటకు  కారణము  తెల్పదరా  ఒక ప్రముఖ  ఆంగ్ల సినీవార  పత్రిక  “యింటర్ వ్యూలో  “ సినిమా  ప్రేక్షకుల అభీప్రాయములమీదనే  ఆధారపడుచుందును. దినమునకు  ముప్పదివరకు  ఉత్తరములకు సమాధానములిస్తూ  యుంటాను  అని  చెప్పితిరిగదా  ఇందులోని  ఆంతర్యమేమి?     
జః తీరిక  ఉన్నంతవరకూ  జవాబులు  వ్రాస్తూంటాను.
ప్రఃనన్ను మరిచిపోయారా సిస్టర్?
జః మరచిపోలేదు  బ్రదర్.
ప్రః నటీనుటులకు  దర్శకుడు  ముందుగా  కథంతా,  చెప్తాడా  లేక  వారివారి  పోర్షన్లకు  మటుకే  తెలియజేస్తారా?  
జఃకొంతమంది కథ చెబుతారు,మరి కొంతమంది పోర్షన్ల వరకే చెబుతారు,మరి కొందరు ఏమీ చెప్పరు.

ప్రః సినిమాలవలన  మన దేశపు  నవయువతీ  యువకులలో  ఎట్టి  చైతన్యము

  రేకెత్తినదో తెలుపగలరా?

జః ప్రతీవాళ్ళూ సినిమాలలో  చేరాలనే  చైతన్యం.....

సి. ఎస్ . రాములు  బి. ఆర్. రెడ్డి. ఆదోని

ప్రః మీరు  నాగేశ్వరరావుతో  ప్రస్తుతము  చాలా  చిత్రలలో

  నటించుచున్నారు.  కారణం?

జః నిర్మాతలు  మమ్మల్నిదద్దర్నీ బుక్  చేయటమే  కారణం.

ప్రః మీరు నటించిన  మొదటి  చిత్రం సంసారం  అని నేను, కాదని 

నా స్నేహితుడు  వారంచుకుంటున్నాము. యిందులో  ఎవరిది తప్పు?

జః మీ స్నేహితుడిది  తప్పు.

ప్రః కనకతారలో  నటించిన  కన్నాంబ  మొదటి  చిత్రమేది?

జః కినిమా వారిని  అడిగి  తెలుసుకోండి.

 పొన్నలూరి  శ్రీరామచంద్రమూర్తి , ఉరవకొండ.

ప్రః పార్వతీ మీకు  మాటయిచ్చి  దేవదాసు  మిమ్ము  చేరకుండగనే 

మరణించాడేం?  ఆఖరికి మీ భర్త మీకు  దేవాదాసు  దర్శనము కూడ

  లేకుండా  చేశాడేం  ఎందుకో తెలియజేస్తారా?

జః ఈ సందర్భంలో  శరత్ చంద్రబాబు  వుంటే  ఎంత బాగుండేది.

డి.ఎమ్. ధర్ , రాజమండ్రి

ప్రః మీకు  నేను వెనుక ఒక ఉత్తరము  వ్రాయగా , దానికి జాబు వ్రాయకపో

వుటకు  కారణము  తెల్పదరా ? ఒక ప్రముఖ  ఆంగ్ల సినీవార  పత్రిక

  యింటర్ వ్యూలో  సినిమా  ప్రేక్షకుల అభీప్రాయముల

మీదనే  ఆధారపడుచుందును. దినమునకు  ముప్పదివరకు

 ఉత్తరములకు సమాధానములిస్తూ యుంటానుఅని  చెప్పితిరిగదా  ఇందులోని ఆంతర్యమేమి?     

జః తీరిక  ఉన్నంతవరకూ  జవాబులు  వ్రాస్తుంటాను.

ఆర్. ఎస్. మూర్తి,   14/35   ఆచారివీధి, నెల్లూరు.

ప్రః మీరు పెంపుడు కొడుకు   చిత్రములో  బావిదగ్గర  పూలచెట్లకు

  నీరుపోయుచు, పాడినపాట  హిందీ  చిత్రము ఆన్ లోని  పాటను

 అనుకరించినట్లు  తలుస్తాను.  నిజమేనా?

జః నిజమే.

ప్రః మీరు  హిందీ చిత్రములలో  గొప్ప  నటీమణుల  నటనను  చూచి  అలాగే,

అనుకరిస్తూ  నటిస్తారని  విన్నాను  నిజమేనా?

జః అలాంటి  అలవాటు  లేదు.

మిన్ ఆర్. బి. ప్రభావతి, నాజర్  పేట , తెనాలి.

ప్రః నీకెట్టి  పాత్రయనిన  అభిమానము  మెండు?

జః శక్తి సామర్థ్యాలుగల  ఏ పాత్రనైనా  అభిమానంతో  నటిస్తాను.

ప్రః అట్టిపాత్ర  నీ విప్పటివరకు  వేసిన  ఏ చిత్రములోనైనా  గలదా?

జః కలదు.

ప్ర సినీనటులు  రాజకీయవేత్తలయి, రాజకీయవేత్తలు  సినీ  నటులయినచో

  నప్పుడు  భావి  భారత  పరిస్థితి  యెట్టుండును.

జః తలక్రిందులుగా  నుండును.

ప్రః మీ  నటీనటులకు  డబ్బు  విలువ, కష్టములనుభవించుట, సహనము 

మొదలగునని  తెలియునా?

జః తెలియును.

ప్రః నీవు  వేసిన  చిత్రములలో  నేవేవి  శతదినోత్సవములు  చేసుకొన్నవి?

జః పెళ్ళిచేసిచూడు, దేవదాసు, బ్రతుకుతెరువు,  ప్రతిజ్ఞ.

 కాండ్రేగుల  అప్పారావు , అనరాపల్లి.

పి. సంజీవరెడ్డి , వద్యారం.

ప్రః కినిమా గురించి  మీ అభిప్రాయమేమిటి  సెలవిస్తారా?

జః మంచి ఆదర్శాలుగల  పత్రిక.

ప్రః మీ ఆటోగ్రఫీ తీయించి  పంపుతారా?

జః ఆటోగ్రఫీ  తీయించడం  ఏమిటి  సోదరా?

 ఎమ్. ఆనందరెడ్డి, 479  పంటవీధి, తిరుపతి.

ప్రః మీకు వివాహము  జరుగక  మునుపే   మీ చెల్లిగారైన  మారుతి  వివాహము

  చేసుకొనుటకు కారణమేమి?

జః మారుతి మా చెల్లికాదు...ఆమె మా అక్కయ్య.

ప్రః యువరాజు  వేషమునకు  ఎన్. టి రామారావు  తగినవారని  నా

ప్రియమిత్రుడు  కె. రామమూర్తి  రెడ్డియు, ఏ. నాగేశ్వరరావు  తగినవారని  నా  ప్రియసోదరుడు  టి. రామచంద్రారెడ్డియు  వాదములాడుచున్నారు.

అందులకు  నేను  వారి  పర్సనాలిటీని చూచి  వారికి  యిష్టమైన  వారిని  తీసుకొందురని  నా అభిప్రాయము  చెప్పితిని.  ఇందులో  మీరు  ఎవరితో  ఏకీభవిస్తారు.?

జః మీతో  ఏకీభవిస్తాను.

ప్రః మేము  మీతో  కలసి మాట్లాడవలసియున్నది.  మేము మీ యింటికి  వచ్చిన

  గౌరవించెదరా?   అగౌరవించెదరా?  మీ అడ్రసు  తెలిపవలసినదిగా కోరుచున్నాను?

జఃఅగౌరవించే  అలవాటు  నాకు  లేదు. తప్పకుండా  మీతో  మాట్లాడతాను. 

   అడ్రసు 11 , వైద్యరామయ్యర్  వీధి, త్యాగరాయనగర్, మద్రాసు -17

గంధి  రామారావు, పార్వతీపురం.

ప్రఃదేవదాసు  చిత్రంలో  పాత్రను మీరు  పోషించలేక  పోయారు. భావాలను 

వ్యక్తపరచడంలో  చాలా  లోపాలున్నాయ్. తప్పు మీదా   లేక   దర్శకునిదా?

జః తప్పు  నాదే  కావచ్చు.

ప్ర. మీరెంత వరకు చదువుకున్నారు ? మీకు మాట్లాడను ఎన్ని భాషలు వచ్చు?

జః థర్డ్ ఫారం వరకు చదువుకున్నాను.తెలుగు,తమిళం,హిందీ,మాట్లాడటం వచ్చు.