◄
‘ చిత్ర సీమ ’ సెప్టెంబర్ 1957, నుంచి
సావిత్రికి మామూలు సమయాల్లో‘మేకప్’ చేసుకోవటమంటే
మహామంట.సింపుల్ గా ఉంటేనే బాగుంటుందని ఆమె అభిప్రాయం. సావిత్రి అంటే నిర్మాతలకు
చాలా సదభిప్రాయం ఉంది. సెట్స్ లోకి వెళ్లిందంటే , ఏ ‘మూడ్’ లోకి
వెళ్లాలన్నా, డైరక్టర్ చెప్పిన మరుక్షణంలో ఆ ‘మూడ్’లో
ప్రవేశించగలదు.అంతేగాని, యివ్వాళ ‘మూడ్’లో
లేనండి అనే ఆర్టిస్ట్ కాదు సావిత్రి. ‘వేంప్
రోల్స్’ అన్నా , వేంప్ గా వుండటమన్నా ఆమెకు సుతారామూ యిష్టం
లేదు.
సౌందర్యార్చన
కోసంటాయిలెట్స్ ,క్రీములువాడటం యిష్టం లేదంటుందిసావిత్రి. ‘మేకప్’ దేనితో చేసుకుంటారు మీరు ?
అని
చాలా మంది ప్రశ్నిస్తారు.దేనితోనూ చేసుకోను ,అంటుందామె.చిరునగవుకు మించిన సౌందర్య
భూషణం మరేదీ లేదని ఆమె అభిప్రాయం.తన అభిమానులు వ్రాసే ఉత్తరాలన్నీ చదువుతుంది
గాని,తీరిక చిక్కనందున అందరికి వ్రాయటం కుదరటం లేదని ఆమె
చింతిస్తుంది.