◄
‘ కినిమా’ పత్రిక జూన్ 1958.
సినీ తారలపై నిర్వచనాలు. ..ఫిలోమెన్ దాస్
( ఇవి కేవలం హాస్యం కోసం వ్రాయబడినవి. కాబట్టి నవ్వుతూ చదవండి)
జి. వరలక్ష్మ : పీడిత నాయకులకై ఎర్ర మేఘాలలో సంచరించిన అరుణతార.
సావిత్రి: తెరమీదే కాకుండా, తెర వెనక కూడ ఆదర్శ జీవితాన్ని నడుపుచున్న మేడం... సావిత్రి.
కృష్ణవేణి : స్థితి స్థాపక హద్దుదాటి
తెగిపోయిన రబ్బర్ ముక్క
జానకి : హక్కడు బుక్కడు అనతగ్గ విజయా
అధినేతలచే చెక్కబడిన చెక్క బొమ్మ.
కృష్ణకుమారి : అవకాశం చిక్కినా, కాలదోషం వల్లకలసిరాని కమ్మని నటీమణి.
కుసుమకుమారి : తీక్షణమైన పవనాలకు ఆగలేక గోతాలు కోడ్తుయున్న తోక తెగిన గాలిపటం.
వహీదా : దక్షిణాదిలో విత్తనం నాటబడి, ఉత్తారాదిలో పెరుగుతున్న అనార్కాలి ( దానిమ్మ పువ్వు).
వైజయంతి మాల : మదరాసు టాలీవుడ్ నుంచి బొంబాయి హాలీవుడ్ కు అంకితం చెయ్యబడిన తార.
నాగయ్య : కళామతల్లిని ఉద్దరించ కాసులుగానక కటకటలాడే కళాజీవి.
నారాయణరావు : కాల మార్పుచే విలువ తగ్గి మూల పడిన వెండి నాణెం.
రఘరామయ్య : దశాబ్ధి క్రితం పామర జనాన్ని తన ఈల గానంతో మైమరిపింపజేసిన నిండు మూర్తి.
దొరస్వామి : అవకాశం చిక్కినప్పుడెల్లా తెరపై ఉరికంబమెక్కే నిరాశాజీవి.
గౌరీనాధ శాస్త్రీ : ఆంధ్ర హాలీవుడ్ నుంచి క్రింద రాలిపోయిన తోకచుక్క.
సి. యస్. ఆర్. : డొక్క శుద్ధి, చిత్తశుద్ధి కలిగిన పసందైన పక్కా నటుడు.
శివాజీ గణేశన్ : ఉద్రేక పూరితమైన ఊకదంపుడు ఉపన్యాసాలచే హాలునంతటిని ఆరావం కావించే అపర గగ్గయ్య.
శివరావు : తన వేలుతోనే తన కంటిని పొడుచుకొని, కొంతకాలం చీకటి కూపంలో పడి, యిప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న అతి హాస్యనటుడు.
ఘంటసాల : తన ఘంటారావంతో దక్షిణాదినంతటినీ ఒకఊపు ఊపిన దివ్వమూర్తి.
దక్షిణామూర్తి : కాపీ సంగీత దురంధర మూర్తి.
సుశీల : పండిత పామర హృదయాలను కరిగించే కోయిల.
హెచ్.ఎం.రెడ్డి. : ఇటు కళను ఉద్ధరించక, అటు బాక్సాఫీసు బ్రద్దలు కొట్టక విశ్వామిత్ర సృష్టి కావించబడిన పితామహుడు.
రూడ్ : ఆంధ్ర హాలీవుడ్ నుంచి ఆకాశానికి అన్నపూర్ణా వారిచే వదలబడిన ఆంధ్ర లైకా.